CM Chandrababu : ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజల తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నాటి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్మాద పాలనను తుది గా అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. “జూన్ 4…. […]
Tragedy : ఉత్తర ప్రదేశ్‌లోని నగ్లాస్వామి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికై యమునా నదిని సందర్శించిన ఆరుగురు యువతులు మృత్యువాత పడ్డారు. ఒక్క కుటుంబానికి చెందిన ఈ ఆరుగురు యువతులు అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో నదిలోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ ఒక యువతి నీటిలో మునిగిపోవడం చూసిన మిగతా ఐదుగురు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. GHMC : జీహెచ్ఎంసీ బార్లకు […]
GHMC : జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు మిగిలిన మూడు రోజుల వ్యవధిలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పీ. దశరథ్ తెలిపారు. నాంపల్లి కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇటీవల రూరల్ ప్రాంతాల్లో బార్లకు అనూహ్యంగా అధిక దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తంగా జీహెచ్ఎంసీతో కలిపి 28 బార్లకు పునరుద్ధరణ కోసం దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు […]
MLC Kavitha : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన […]
ఇరాన్లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు క్షేమం.. రక్షించిన టెహ్రాన్ పోలీసులు ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్) వాసులు మే 1న ఇరాన్ వెళ్లారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్. అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల […]
ఆ కాంగ్రెస్ ఎంపీ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అయ్యారు? అధికారిక కార్యక్రమం అయ్యాక ప్రైవేట్ మీటింగ్ మతలబేంటి? ఎమ్మెల్యే కారు దిగేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఎంపీ టూర్ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌ని బయటపెట్టిందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? వాళ్ళ మీద రూమర్స్ ఎందుకు మొదలయ్యాయి? నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయ్యాక తొలిసారి గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, […]
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ మొత్తం 770 ఫోర్లు బాదాడు. దీంతో అతను ఫోర్ల పరంగా టాప్ స్థానంలోకి ఎగబాకాడు. గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న కోహ్లీ, ఈ రికార్డుతో తన క్లాస్‌ను మరోసారి […]
బాలినేని శ్రీనివాసరెడ్డి… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. నాడు వైఎస్ కేబినెట్లో, 2019 తర్వాత జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారాయన. ఎవరు అవునన్నా.. కాదన్నా.. నాడు మంత్రివర్గ విస్తరణలో జగన్ బాలినేనిని కేబినెట్ నుంచి తప్పించడంతోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు. ఆ గ్యాప్ అంతకంతకూ పెరిగిపోయి…. చివరికి ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగి గ్లాస్ పట్టుకున్నారు బాలినేని. అలా… ఆయన జనసేనలో చేరిపోయాక ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోతుందని భావించారు […]