MP CM Ramesh : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. సీఎం రమేష్ మాట్లాడుతూ, “కవిత అరెస్ట్ తర్వాత నువ్వే నా ఇంటికి వచ్చావు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని అప్పుడే చెప్పావు. కవితను విడుదల చేస్తే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని నువ్వు చెప్పిన విషయం మరిచిపోయావా?” అని ప్రశ్నించారు.
JD Lakshmi Narayana Podcast: ఆ పోస్ట్ ఇవ్వలేదని జాబ్‌కు రిజైన్ చేశా.. జేడీ లక్ష్మీనారాయణ ఓపెన్
అలాగే, “నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. కేవలం 300 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం నీకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా సంస్కారం అడ్డువస్తోంది” అని సీఎం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
Vishwambhara : కీరవాణి ఉండగా భీమ్స్ తో పాట.. కారణం చెప్పిన వశిష్ట