HYD: నేడు వనమహోత్సవం -2025 కార్యక్రమం. ప్రొ.జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000,18 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,600 లుగా ఉంది. అలాగే కిలో వెండిధర రూ. లుగా ఉంది. 1,11,100 తిరుపతి: నేడు ఇందిరా మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభ. హాజరుకానున్న రాష్ట్ర బిసి మంత్రులు అనగాని సత్యప్రసాద్, […]
అక్కడ మామ పొలిటికల్ జర్నీకి అల్లుడు మోకాలడ్డుతున్నాడా? లేక అల్లుడికి చెక్ పెట్టేందుకు మామ కామ్‌గా పావులు కదుపుతున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని రెండు పక్షాల అనుచరులు రక్తి కట్టిస్తున్నారా? గత ఎన్నికల్లో అల్లుడి చేతిలో ఓడిన ఆ మామ ఎవరు? ఇద్దరి మధ్య సోషల్ యుద్ధంలో బయటికి వస్తున్న కొత్త విషయాలేంటి? పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు […]
కాంగ్రెస్ కంచుకోటలో తేడా రాజకీయం నడుస్తోందా? పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్ళని కాదని ఎవరెవరికో పదవులు ఇస్తున్నారన్న అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయా? ఇన్నాళ్ళు లోలోపల రగిలిపోతున్న వాళ్ళు ఇక ఓపెన్ అవుతున్నారా? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా అసంతృప్త నేతలు? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం. ఆ బలంతోనే…. 2014 ఎన్నికల్లో కేవలం 11 రోజుల ముందు ములుగు నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు […]
ఆ వైసీపీ నాయకుడు తూర్పుకు తిరిగి దండం పెట్టేశారా? రాజకీయం చేయడం ఇక నావల్ల కాదు బాబోయ్… అంటూ దండం పెట్టేశారా? ఒకప్పుడు తోపు అనుకున్న ఆ లీడర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో… పార్టీ కూడా లైట్ తీసుకుందా? పొరుగింటి పుల్లకూర మనకు వర్కౌట్ కాదని డిసైడై… లోకల్ రాగం పాడుతోందా? ఏదా నియోజకవర్గం? సైలెంట్‌గా సైడైపోయిన ఆ నాయకుడెవరు? ఆవిర్భావం నుంచి వైసీపీ అధిష్టానానికి తీరని కల… విశాఖ నగరంలో జెండా ఎగరేయడం. సిటీలోని నాలుగు […]
వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్నినాని కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే, వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు. అయితే, వల్లభనేని వంశీ, కొడాలి నాని, […]
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు మూడ్ నుంచి బయటికి రాలేకపోతోందా? వరుసగా మూడు ఎన్నికల నుంచి మూడో స్థానానికే పరిమితం అయి పడుతూ.. లేస్తున్న చోట ఇప్పుడు మూడు ముక్కలాట మొదలైందా? ఇన్ఛాలేని చోట మాకంటే… మాక్కావాలంటూ… నేతలు పావులు కదుపుతున్నారా? అంగట్లో అన్నీ ఉన్నా…. అన్న సామెతని గుర్తు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా మూడు ముక్కలాట ప్లేయర్స్? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం…. 2004 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు. […]
Chennamaneni Ramesh Babu : వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు ఓటు హక్కు ఇక ఇకలేనిది. రాష్ట్ర హైకోర్టు జర్మనీ పౌరుడని తేల్చిన తీర్పు ఆధారంగా, అధికారులు ఆయన్ను ఓటర్ జాబితా నుండి తొలగిస్తూ అధికారికంగా ప్రకటించారు. వేములవాడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి & ఆర్డీవో రాధాబాయి, జూన్ 24న ఫారం-7 ద్వారా నోటీసు జారీ చేస్తూ ఏడురోజుల గడువు ఇచ్చారు. గడువు ముగిసిన నేపథ్యంలో, జూలై 3న వేములవాడ నియోజకవర్గంలోని బూత్ […]
ఊరు మారినా… తీరు మారలేదన్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఉందా? ఉన్న పార్టీని కాదని అధికార కూటమివైపు జంప్ చేసినా… ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదా? అసలెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను రా… బాబూ… తప్పుచేశానా అని ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారా? ఎవరా మాజీ సీనియర్ ఎమ్మెల్యే? ఆయన నైరాశ్యానికి కారణాలేంటి? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సామినేని ఉదయభాను. రెండు విడతలు కాంగ్రెస్, మూడు […]
Telangana : తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థల (షాపులు తప్పనిసరి) ఉద్యోగుల పనివేళల పరిమితిలో కీలక మార్పు చేసింది. ఉద్యోగులకోసం రోజుకు గరిష్టంగా 10 గంటలు, వారానికి గరిష్టంగా 48 గంటల పని చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పరిధిలో తీసుకున్న నిర్ణయంగా, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రభుత్వం జూలై 5, 2025న జారీ చేసిన G.O.Rt.No.282 ప్రకారం, 1988లో రూపొందించిన తెలంగాణ షాపులు […]
తెలంగాణ కాంగ్రెస్‌లో తల పండిన నాయకులు కూడా మాట్లాడలేని మాటల్ని ఆ యువ ఎమ్మెల్యే ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏకంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా… మాటల తూటాలు పేల్చడం ఆయన నైజమా? లేక వ్యూహమా? అదీ.. ఇదీ.. కాకుండా ఎవరో వేస్తున్న తాళానికి ఈయన రాగం ఆలపిస్తున్నారా? పార్టీని అంతలా ఇరుకున పెడుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? పదే పదే ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? జనంపల్లి అనిరుథ్‌రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా… జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. […]