Weather Updates : తెలంగాణ ప్రజల నిరీక్షణకు తెరపడింది.. ఎప్పటిలా కాకుండా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే పలకరించాయి, జూన్ చివరి వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులతో స్వాగతం పలికాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, రైతన్నల ముఖాల్లో చిరునవ్వు, బీడు భూములకు జీవం, నగరవాసులకు ఉపశమనం.. సాధారణంగా జూన్ రెండో వారంలో మొదలయ్యే రుతుపవనాలు, ఈసారి కాస్త తొందరగానే తెలంగాణ గడ్డను తాకాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. […]
అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4:50 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్న జగన్.. రాత్రి 7:10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. రాత్రి 7.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్.. నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,56,554 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. […]
HYDRA : హైదరాబాద్ నగరంలోని మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని సాయి సారధి నగర్లో ఉన్న decades-old పార్కు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన నిర్మాణాలను హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (HYDRAA) ఆదివారం కూల్చివేసింది. వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ప్రజావాణి ఫిర్యాదు ఆధారంగా, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు నిర్వహించిన విచారణలో 1961లో రూపుదిద్దుకున్న 35 […]
సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం.. మండిపడిన ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఈ బిల్లుపై సెనెట్‌లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు మస్క్.. ఈ బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో రాసుకొచ్చాడు. […]
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రానికి తగినదే కాకుండా, నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం తన పాత్రను వదిలి, శత్రుదేశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో ఢిల్లీలో మైత్రీ, రాష్ట్రంలో […]
Anchor Swetcha : ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక్కొక్కటిగా కొత్త వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె కుమార్తె అరణ్య, తండ్రి శంకర్ ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు స్వేచ్ఛను పదేళ్లపాటు పెంచిన మేనమామ అత్త సుశీల నరసయ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ చిన్ననాటి నుంచి తమ ఇంటిలో ఎంతో ప్రేమతో పెరిగిందని ఆమె భావోద్వేగంగా గుర్తుచేశారు. సుశీల మాట్లాడుతూ .. “స్వేచ్ఛను నాలుగు నెలల పాపగా ఉన్నప్పటి నుంచి […]
Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు […]
మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ […]
Orange Travels : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి వేళ వంకరగా ఉన్న రహదారిపై బస్సు అదుపు తప్పి […]
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు.. విజయవాడ: నేడు దుర్గమ్మకు బంగారు బోనం సమర్పణ. హైదరాబాద్ ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో బోనం. జంటనగరాల్లో ఆషాఢ శోభ. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచే బోనాల ఉత్సవాలు ఆరంభం. నగరంలో ఘనంగా రాష్ట్ర పండుగ బోనాల పండుగ ఉత్సవాలు.. ఇవాళ్టి నుంచి నాలుగు ఆదివారాలు జంటనగరాల్లో బోనాల సందడి. […]