Weather Update : తెలంగాణ రాష్ట్రంలో ఈ వారాంతం వరకు వర్షాలు మేల్కొలుపు గానుండనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూన్ 29వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. Priya Vadlamani : పరువాల ప్రదర్శన చేస్తున్న ప్రియా వడ్లమాని.. వాతావరణ శాఖ […]
TG Cabinet : సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, తదుపరి సమావేశం జులై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతోపాటు, ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం […]
గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు. నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్‌నగర్‌లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి […]
Tejeshwar Murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహా 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. పెళ్లికి ముందు మొదట నిశ్చితార్థం జరిగిన తరువాత ఇంటి నుంచి ఐశ్వర్య వెళ్లిపోయింది. ఆ సమయంలో ఐశ్వర్యను తిరుమలరావు తన ఇంటికి తీసుకెళ్లి ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తన […]
ISKCON : రాజమండ్రి నగరం ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలతో నిండబోతోంది. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం సందర్భంగా జూన్ 27, 2025 (శుక్రవారం) నాడు ఐఎస్కాన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో గొప్ప స్థాయిలో రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రథయాత్ర ప్రత్యేకత ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటలకు జే.ఎన్. రోడ్ లోని శ్రీ రామాలయం వద్ద నుంచి ప్రారంభమై, దానవాయిపేట, జంపేట, దేవిచౌక్, మేయిన్‌రోడ్ మీదుగా పురవేగంగా సాగుతుంది. ఈ పూజ్య యాత్ర చివరికి ISKCON […]
నేడు కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్.. సొంత నిధులతో..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ […]
Tejeshwar Murder : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో […]
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల […]
Minister Seethakka : తెలంగాణలో డ్రగ్స్ వ్యసనం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, నేషనల్ ఆంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అనే వ్యాధి యువతను భయంకరంగా పీడిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వినిపించే సమస్య. ఇప్పుడు మాత్రం స్కూల్ల దాకా ప్రవేశించింది. చాక్లెట్లు, బిస్కెట్లు రూపంలో పిల్లలకు చేరుతోంది. ఇది […]
Shocking : సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతిరోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో కడిగుకుంటానంటూ ఓ వీడియో పెట్టింది. ‘యూరిన్ ఐ వాష్ – నేచురల్ మెడిసిన్’ అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. దీంతో వీడియో వైరల్ అయింది. అయితే నెటిజన్లు, వైద్య నిపుణులు మాత్రం మండిపడుతున్నారు. నుపుర్ పిట్టీ అనే మహిళ తనను ‘మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్’గా చెప్పుకుంటోంది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ […]