Pashamylaram : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ఘోర రసాయన ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. సిగాచి ఇండస్ట్రీస్‌కి చెందిన ఈ రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరెన్నో శవాలు ఇప్పటికీ గుర్తుతెలియని స్థితిలో ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వర్షం పడుతున్నా కూడా సహాయక చర్యలు […]
ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ. సంగారెడ్డి : నేడు సిగాచి పరిశ్రమకి సీఎం రేవంత్ రెడ్డి. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. అనంతరం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్. నేడు తెలంగాణ గ్రూప్-1 పిటిషన్లపై విచారణ. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై […]
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠ నేపథ్యంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై అనవసర చర్చలు, విమర్శలు అర్ధహీనమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక కట్టర్ కేడర్‌తో కూడిన పార్టీ అని, రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు బండి సంజయ్. అధికారం […]
CM Revanth Reddy : పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల ధాటికి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. Illegal relationships : దాంపత్య బంధానికి పెనుభూతులవుతున్న వివాహేతర సంబంధాలు.. […]
ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన భూగర్భ కేంద్రం ఫోర్డోపై అమెరికా ప్రయోగించిన బంకర్-బస్టర్ బాంబులు దూసుకుపోయాయని.. ప్రస్తుతం అక్కడ వేల టన్నుల రాత్రి మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయని పేర్కొన్నారు. […]
Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ […]
Harish Rao : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు భవిష్యత్తు నిర్మాణంగా నిలిచిన గురుకులాలు, ప్రస్తుతం నిర్వీర్యం అవుతుండటం దురదృష్టకరమని ఆయన ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉదాసీనత లక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల […]
Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని […]
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని.. 27శాతం కుంగిపోయిందని.. కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని.. లక్షన్నర ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్‌రాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ మూడేళ్ల క్రితమే.. NTV చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ.. రియల్ ఎస్టేట్ పతనంపై NTV ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ […]
TBJP Chief : తెలంగాణ బీజేపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావును అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. రామచందర్‌రావు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావుకు […]