సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గాదరి కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు గతంలో సీఎం కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీగా నియమించి వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు.