కీసరలోని సాయిధామం ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామనందప్రభు స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ సాయిధామం ఆశ్రమ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, అందుకు అడ్డుపడుతున్నందుకే స్వామీజీపై ఈ వేధింపులా అంటూ భక్తులు మండిపడుతున్నారు.
అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆశ్రమ సభ్యులు, హిందూ సంఘాల నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామిజీని విడుదల చేయాలంటూ ఆందోళన ఆందోళన చేపట్టారు.ఇదిలా ఉంటే.. స్వామీజీ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఓ యువతి కంప్లేంట్ చేసిందని అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీ సత్యాపదనంద ప్రభుజీ శివైక్యం చెందిన తర్వాత ఆధిపత్యం కోసం రెండు వర్గాలుగా ఆశ్రమ నిర్వాహకులు చిలిపోయారు. గత ఏడాది నుంచి ఆశ్రమంలో గొడవలు జరుగుతున్నాయి.