కృష్ణ బోర్టుకు చెందిన సభ్యులు రెండవ రోజు నాగర్జున సాగర్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ అధికారులతో కేఆర్ఎంబీ బృంద సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం కేఆర్ఎంబీ బృంద సభ్యులు మాట్లాడుతూ.. సాగర్ స్థితిగతులు తెలుసుకొని రూట్‌మ్యాప్ తయారీ చేసినట్లు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిశీలించి నివేదికలు పంపుతామని తెలిపారు. నాగార్జున సాగర విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించలేదని, వచ్చే పర్యటనలో విద్యుదుతప్పత్తి కేంద్రాలు పరిశీలించి నివేదిక సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన డ్రైవర్ దస్తగిరి కొన్ని రోజుల క్రితం అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఎలా.. ఎవరు హత్య చేశారో కూడా వాగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ దస్తగిరి వాగ్మూలమిచ్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన […]
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారబట్టిలో గత శనివారం భీకర ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసింది. ఈ ఎన్ కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందగా, అందులో ఆరుగు మహిళలు ఉన్నారు. అయితే మరణించిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం. తాజాగా గడ్చిరోలి జిల్లా కుడుగుల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీలకు మరో మావో మృత దేహం లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం జహల్ నక్సలైట్ నాయకుడు సుఖ్లాల్ […]
కుప్పం పురపోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. కుపుం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో దొంగ ఓట్లు వేశారని వైసీపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి స్పందిస్తూ..కుప్పంలో దొంగ ఓట్లు అని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇంత వరకు […]
ఓ మహిళపై కాల్ మనీ టీం దాడి చేసిన ఘటన కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన సింధు మహిళ కాల్ మనీ టీం వద్ద రూ.4.6 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ అప్పుకు రూ.10 వేలు నెలకు వడ్డీగా కడుతోంది. ఇలా 7 నెలల్లో రూ.6.55 లక్షలు వడ్డీగా చెల్లించింది. అయితే ఈ నెల డబ్బు చెల్లించడంలో ఆలస్యం కావడంతో కాల్ మనీ టీం సదరు మహిళపై కర్కశత్వంగా దాడి […]
ఏటూ చూసిన శివనామస్మరణ.. అడుగడుగునా పంచాక్షరి పలుకులు.. అహా ఇది కైలాసమా అనట్టు ఉండే వేదిక.. ఆ వేదికను అలంకరించిన దైవ స్వరూపులైన పెద్దలు.. ఏమి చెప్పమంటారు కోటి దీపోత్సవ కళాశోభ.. ఇక బంగారు లింగోద్భవ ఘట్టం గురించి చెప్పాలంటే.. మాటలు రావడం లేదు.. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదలు బయటికి వచ్చే వరకు కార్తీకమాసంలో కైలాసం దర్శనం జరుగుతోందనే భావన తప్ప మరేది మదిలోకి రాదు అనడం అతిశయోక్తి లేదు. మంగళవాయిద్యాలు నడుమ స్వామి […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నల్గొండ పర్యటనలో జరిగిన దాడిపై నేడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ నల్లొండలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. అయితే దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుపుతూ గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. గ్రామాల్లోకి వెళ్లి రైతుల బాధలు […]
తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలు విషయంలో అగ్గి రాజుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ల మధ్య ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇస్తూంటే.. ఇప్పడొచ్చి బీజేపీ నేతలు వరి కొనుగోలు చేయాలంటూ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లడం హాస్యస్పదం అన్నారు. అంతేకాకుండా రైతుల సమస్యల […]
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి చౌరాసియాపై లైంగిక దాడి జరిగిందని వార్తలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. నటి చౌరాసియా పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, కేవలం సెల్‌ఫోన్ దొంగలించడం కోసమే ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని వారు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు […]
మెగా అభిమానులే కాదు, స్టోర్ట్స్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గని. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు వరుణ్‌తేజ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ విడుదల చేస్తూ, ఈ సినిమా అంచనాలు అమాంతంగా పెంచుతున్నాయి. గని ప్రపంచం అంటూ విడుదల చేసిన వీడియోలో నదియా, ఉపేంద్ర, తనికళ భరణి, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కనిపించారు. ఈ సినిమాలో వీరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ […]