సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నేడు పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాని విచ్చేశారు.
దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించకుంటే ఎవ్వరినీ ఆలయంలోకి అనుమతించడం లేదు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పాలక మండలి ఏర్పాటు చేసింది.