సినిమా టికెట్ల ధరల అంశం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నేడు చిరంజీవి టీం సీఎం జగన్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం చిరంజీవి టీం మీడియా సమావేశం నిర్వహించి.. సీఎం జగన్ సినీ పరిశ్రమకు మంచి చేకూర్చేందుకు అడుగుల వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి టీంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే తాజాగా మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా ‘ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభ్యర్థలను పరిగణలోని తీసుకున్నందుకు, తెలుగు సినిమా అభివృద్ధి చెందడానికి మాకు ఉత్తమమైన హామీని ఇస్తున్నందుకు. సీఎం జగన్ గారికి ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం మరియు మా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ అవగాహన తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కటి సమతుల్యతతో పరిష్కారాన్ని కనుగొంటారని మేము పూర్తిగా ఆశిస్తున్నాము.’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా మమ్మల్ని నడిపించినందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలా అవసరమైన ఈ సమావేశాన్ని సులభతరం చేసినందుకు మంత్రి పేర్ని నాని లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.