యావత్తు ప్రపంచాన్ని అతాలకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో తగ్గుముఖం పట్టిన కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో భారత్‌లో ధర్డ్ వేవ్ మొదలైంది. దీంతో కరోనా కేసులు భారీగా నమోదైన రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు కఠిన తరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధించారు. దీంతో థర్డ్‌వేవ్ అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు భారత్‌లో 5వేల లోపు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో మంగళవారం 91 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 7,89,951కి చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 4,111 అని హెల్త్ బులెటిన్ తెలిపింది. మొత్తం 241 మంది వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 99.31 శాతంగా నమోదైంది. తెలంగాణలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,375 వద్ద ఉంది. ఇప్పటివరకు, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో 3,37,39,324 కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించగా, అందులో 7,89,951 పాజిటివ్‌గా తేలాయి. అయితే అందులో 7,84,465 మంది కోలుకున్నారు.