సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి హైదరాబాద్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సైబర్ దాడిలో మహేష్ బ్యాంకు నుంచి నిందితులు రూ. 12 కోట్లు మాయం చేశారు. ఈ 12 కోట్లను సైబర్ 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు, మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ పై ఈ దాడి జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు […]
కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని నాలుగు రోజులు పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించినట్లు విచారణలో తేలిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీరి ఇద్దరిపై పీఎంఎల్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేశామని, కార్వీ స్టాక్ బ్రోకింగ్ 2873 కోట్లు రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఈడీ అధికారులు […]
గత రెండు సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టిపీడిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి కరోనా వైరస్ కు టీకాను కనుగొన్నారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కోవిడ్ టీకా పంపిణీ మొదలైన.. అప్పటికే కరోనా డెల్టా వేరియంట్ రూపంలో మరోసారి సెకండ్ వేవ్ సృష్టించింది. దీంతో ప్రపంచ దేశాలు సైతం కోవిడ్ టీకా పంపిణీని యుద్ధ ప్రతిపాదిక అమలు […]
బీజేపీ పై మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి నియంత పాలనను….ఎప్పుడూ చూడలేదని, బీజేపీ వైఖరి మారక […]
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై గందరగోళం నెలకొంది. చరిత్ర ఇటువంటి పీఆర్సీ ప్రకటన చూడలేదని, న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే పీఆర్సీపై ఉద్యోగ సంఘాలను నచ్చజెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు పీఆర్సీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను ఈరోజు చర్చకు ఆహ్వానించింది. అయితే కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. అయితే […]
మాదక ద్రవ్యాల సరఫరాపై రాష్ట్ర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్మగ్లర్లు పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన పోలీసులు వారి ప్లాన్లను బ్రేక్ చేస్తున్నారు. తాజాగా భారీగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ 55,03,200 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ […]
గుడివాడ క్యాసినో ఘటన రోజురోజుకు ముదురుతోంది. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పేరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ గుర్తుకు వచ్చేవని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కానీ కొడాలి నాని గారు మాత్రం కరోనా తో హైదరాబాద్లో […]
గుడివాడ ఘటనపై వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలా తయారైంది. తాజాగా టీడీపీ రాష్ట్రం కార్యదర్శి బుద్ధా వెంకన్న మంత్రి కోడలి నాని నిన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 2024లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు నిన్ను చంపుతారని, ఓడిపోగానే రాష్ట్రం వదిలి దుబాయి పారిపోతావు అంటూ ఎద్దేవా చేశావు. క్యాసినోలో రూ. 250 కోట్లు చేతులు మారాయి.. డీజీపీ నీకు వాటా ఎంత..? కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..? […]
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నడుస్తోంది. వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. చేతగాని దద్దమ్మ లు, చవటలు చంద్రబాబు పై మాట్లాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అరేయ్ కొడాలి నాని నీ భాష ఏంటి.. కొడాలి నాని నీ చరిత్ర ఏంటి రా.. గుడివాడ లో ఆయిల్ దొంగవి.. వర్ల రామయ్య నిన్ను లోపల వేసి […]
కర్నూలు జిల్లాలోని డోన్ రైల్వేస్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ లో అల్లరి మూకల వ్యక్తులు అరాచకం సృష్టించారు. రాత్రి నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూకలు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న భర్తపై దాడి చేసి మరో మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూక ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేసి గొడవ చేయడంతో.. మహిళ కొడుకును ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో మెట్టుకు మహిళ తల తగిలి మృతి చెందడంతో… […]