Telangana People wanted Double Engine Government in Telangna Says Telangana BJP Chief Bandi Sanjay.
ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకే.. మాములు కార్యకర్తను కేంద్రం గుర్తించేలా చేశారు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నక్సలైట్ల చేతిలో బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రాణలు త్యాగం చేశారంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటం చేశానన్నారు. బీజేపీ కార్యకర్తలకు స్వార్థం ఉండదని, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు బీజేపీ కార్యకర్తలు పని చేస్తారన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడలన్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యకర్తల కోసం ఆలోచిస్తారన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి కార్యకర్త పని చేశాడన్నారు.
పీకే లతో ఏమి కాదని, పీకేనే 20 ఏళ్లు బీజేపీకి డోకా లేదని చెప్పారని, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. 317 జీవో కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను దేశానికి తీసుకురావడానికి మోడీ కష్ట పడ్డారని, ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, నిధులు దుర్వినియోగం చేస్తూ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. ఒక్కసారి బీజేపీ అవకాశం ఇవ్వండని, రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.