ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిన ప్రభుత్వాలు 2001లో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించాయి. స్వరాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణపై ఆంధ్రా నాయకుల రాజకీయ ఆధిపత్యం అంతరించి, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అన్ని రంగాలలో అపూర్వమైన పురోగతిని సాధించింది. కొత్త రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేసి ఉంటే ఇప్పటికి తెలంగాణ ఊహించని విధంగా పురోగతి సాధించేది. కేంద్ర ప్రభుత్వం […]
నేటి సమాజంలో చిన్నాపెద్ద తేడాలేకుండా.. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసిన.. ఎంత భయంకరంగా శిక్షించినా కామాంధులు మారడం లేదు. అన్యంపుణ్యం తెలియని చిన్నారులను సైతం కామాంధులు విడిచిపెట్టడం లేదు.. మృగాళ్లు చిన్నారులపై పడి విచక్షణ రహితంగా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. సమాజంలో ఆడపిల్లల బతుకు ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రేమ పేరుతో ఓ వివాహితుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. […]
నేడు వర్చువల్ గా జీఆర్ ఎంబీ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై కమిటీ చర్చించనుంది. నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కడప జైలులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి పరామర్శించనున్నారు. నేడు సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. పీఆర్సీపై ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది. మహారాష్ట్రలో నేటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. […]
స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే, శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేతాజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర్య పోరాటాలు చేపట్టారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి అనేకమంది స్ఫూర్తినిచ్చారన్నారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది కాంగ్రెస్’ అని రాజా సింగ్ ఆరోపించారు. […]
కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసి-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో టాటా ఏస్ లో ఉన్న 18 మందికి ప్రయాణికులుకు కారులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్ లో ఉన్నవారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా కారులో ఉన్నవారు […]
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాన విపక్ష పార్టీ టీడీపీ గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారని ఆరోపణలు చేస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం అలాంటిది ఏం లేదని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నిజానిజాలు తేల్చుకునేందుకు గుడివాడకు వెళ్లగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆ ఘటన తరువాత నిజ […]
ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఏపీ బీజేపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రేపు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మురళీధరన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తారు. కడప […]
ప్రభుత్వంలో కాపులకు లభిస్తోన్న ప్రాధాన్యత, కాపు సంక్షేమ కార్యక్రమాల పైనా చర్చించేందుకు కాపు నేతలు కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు.. కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. కాన్ఫరెన్సులో ఘంటా, బొండా, వట్టి వసంత కుమార్, మాజీ ఐఏఎస్సులు రామ్మోహన్, భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 13 జిల్లాల్లోని కాపు ప్రముఖులకూ కారెన్సకు ఆహ్వానం ఇచ్చారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు […]
ఏపీలో 11వ పీఆర్సీపై రచ్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాకుండా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేసి రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు […]
యంగ్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ తో మొదలైన మ్యూజిక్ ‘ఎన్’ ప్లే ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా రెండో ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ సింగర్స్ గీతామాధురి, పర్ణిక మాన్య పాల్గొనడం విశేషం. చిత్రం ఏమంటే… వీళ్ళిద్దరితోనూ ప్రోగ్రామ్ హోస్ట్ సాకేత్ కొమాండూరికి స్పెషల్ ర్యాపో ఉండటంతో ఈ ఎపిసోడ్ కు మరింత ఊపొచ్చింది. అసలు షో ప్రారంభం కావడమే… ముగ్గురూ […]