తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొసాగాయి. ఈ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియా స్కూల్ ఏర్పాటుకి సీఎం సబ్ కమిటీ వేశారని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా స్కూల్ లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అని వసతులు కల్పిస్తామని, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ కి ప్రాధానత్య ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మండలం ఒక యూనిట్ గా తీసుకుంటామని, 9,123 స్కూల్ 3 వేల కోట్లు ఖర్చు అవుతాయి అని అంచనా వేసినట్లు ఆమె తెలిపారు.
కేంద్రం విద్యా సంస్థల మంజూరులో కూడా అన్యాయం చేసిందని ఆమె అరోపించారు. నవోదయ పాఠశాలలలో కూడా వివక్ష చూపిందని, దేశానికి ఆదాయం ఇస్తుంది తెలంగాణ.. బెనిఫిట్ పొందటంలో చివరిది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో అగ్రభాగం విద్యాశాఖకే అని, ఉపాధ్యాయులకు ప్రమోషన్, ఏడాదిన్నర క్రితం 8 వేల పోస్టులు భర్తీ చేసుకున్నామన్నారు.