డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. అయితే కొందరు వ్యాపార వేత్తలు పరారీలో ఉండగా… అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు. ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం […]
కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల పొగతో ఆసుపత్రి ప్రాంతం కమ్ముకుపోయింది. ఈఘటనపై సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు, […]
ఏపీలో కొత్త పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా పీఆర్సీపై స్పష్టత లేదని, పీఆర్సీ పై స్పష్టత వచ్చే వరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త జీతాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ఏపీ ప్రభుత్వం […]
ఉద్యోగ సంఘాలకు మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ లేఖ రాసింది. నిన్నటి నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణాలో నేటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. […]
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100 […]
హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీ సంబంధాలు పెట్టుకునందున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేడు హై కోర్టులో విచారణకు వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిజినెస్ మేన్ లను ను విచారించాల్సిన అవసరం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టోని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించని పీపీ కోర్టుకు తెలిపారు. నిందితుడు కాల్ […]
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. […]
తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులుగా మేమంతా ఆరోజు పోరాడాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిరుద్యోగ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఒకే కులానికి మంత్రి పదవులు ఉన్నాయని, ఇతర కులాలకు పనికిరాని పదవులు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..ఉద్యోగాలు అక్కడ లేవు..ఇక్కడ లేవు.. ఉద్యోగాలు వచ్చే వరకు […]
తెలంగాణ లో నిరుద్యోగ భృతి ఇస్తా అని మూడేళ్ళయింది.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి అన్నారు. నిరుద్యోగుల యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని, యువకుడు ముత్యాల సాగర్ చనిపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ ల ముట్టడి చేసాం.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత చనిపోయారు…ఆ అమరవీరుల సాక్షిగా గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టాం ,నివాళులు అర్పించామని ఆయన అన్నారు. సీఆర్ నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా.. 2018 లో ఎన్నికల్లో […]
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగసంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను పీఆర్సీపై చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మంత్రుల కమిటీతో […]