ఎనిమిది కార్పొరేషన్ చైర్ పర్సన్ కార్యాలయాలు ప్రారంభించామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 200 పైగా కార్పొరేషన్ చైర్మన్లు, 2000 పైగా డైరెక్టర్లు ఏర్పాటు చేశామని, తొంభై శాతం పైగా మహిళలకు అవకాశం ఇచ్చామన్నారు. ఎలక్షన్ల ముందు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు గతంలో.. కానీ సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. సమాజంలో అదరణకు నోచుకోని వారందరికి సీఎం జగన్ సామాజిక, రాజకీయ, ఆర్ధిక గుర్తింపు తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
జిల్లాల విభజన ఉగాది నాటికి పూర్తవుతుందని, కాసే చెట్టుకే రాళ్ళేస్తారు.. చైర్మన్లకు కుర్చీ లేదు, జీతాల్లేవని అంటున్నారని, సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఆయన వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ చేతిలో ఉందని, సీఎం జగన్ చెప్పిందే చేస్తారని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవద్దని, ఎమ్మెల్యేలకు ఉండే అధికారాలే చైర్మన్లకు ఉంటాయన ఆయన పేర్కొన్నారు.