ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మంగళవారం ప్రతిపక్ష పార్టీలకు “ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి అభిప్రాయాలు లేవని” అన్నారు. “ఆర్థిక సర్వే తర్వాత భారతదేశంలో ప్రతిపక్షం లేదని మీరు నిర్ధారణకు వస్తారు మరియు బలహీనమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ, దానికి ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి అభిప్రాయాలు లేవు” అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయ సభల్లో […]
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. […]
చేసిన అప్పులు ఎలా తీర్చాలో జగన్ కు తెలుసని , సీఎంగా వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతి శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా […]
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లోని అన్ని కోర్సులకు ఆఫ్లైన్ తరగతులు ఫిబ్రవరి 1 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. ‘ప్రభుత్వ సూచనల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లోని అన్ని కోర్సులకు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని ఓయూ నుంచి పత్రికా ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు కోర్సులు ఆన్లైన్ మోడ్లో జరుగుతాయని పేర్కొన్నారు. “నగరంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ […]
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు రానున్నాయి. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం […]
కుళాయి నీటి సరఫరాలో 100 శాతం సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరింది. సోమవారం పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వే 2021-22 నివేదిక ప్రకారం, జనవరి 2 నాటికి భారతదేశంలోని దాదాపు 5.51 కోట్ల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా అందించబడిన ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హర్యానాతో పాటు తెలంగాణ మాత్రమే ఒక స్థానాన్ని పొందిన ఏకైక ప్రధాన రాష్ట్రంగా నిలిచింది. యాదృచ్ఛికంగా, ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం […]
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారీ కిడ్నాప్ కలకలం రేపుతోంది. నిన్న అర్దరాత్రి కింగ్ కోటి ఈడెన్ గార్డెన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అయితే నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా (60) రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో ఓ వివాహానికి షేక్ గుయోష్ పాషా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో షేక్ గుయోష్ పాషా తిరిగి ఇంటికి వెళుతుండగా, […]
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా బద్దిపోచమ్మకు ఎంతో భక్తిశ్రద్దలతో, అంగరంగ వైభవంగా శివసత్తుల నృత్యాల నడుమ బోనాలు అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు.. వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. […]
డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్తలు డ్రగ్స్ డీలర్ టోనీతో లింకు పెట్టుకున్నట్లు తేలడంతో పోలీసులు ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు. అయితే కొందరు వ్యాపార వేత్తలు పరారీలో ఉండగా… అందులో గజేంద్ర ఫారెక్ అనే వ్యాపారవేత్త కూడా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులకు వ్యాపారవేత్త గజేంద్ర ఫారెక్ చిక్కాడు. ఆటోమోబైల్ రంగంలో మోసాలకు పాల్పడ గజేంద్ర.. ముంబైలో కోట్ల రూపాయల మోసం […]
కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ లోని హోలిస్టిక్ హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల పొగతో ఆసుపత్రి ప్రాంతం కమ్ముకుపోయింది. ఈఘటనపై సమాచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆసుపత్రిలో 35 మందికి పైగా పేషెంట్స్ ఉన్నట్లు సమాచారం. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, రోగి కుటుంబీకులు, […]