యావత్తు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే ఇండియాలో తగ్గుముఖం పడుతోంది. 2020లో ప్రారంభమైన కరోనా విజృంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ రూపాలు మార్చకుంటూ… కొత్త కొత్త వేరియంట్‌లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లు ఇండియాలో వ్యాప్తి చెందడంతో ఇప్పటికే ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ పెరిగిపోవడం.. మునుపెన్నడూ చూడని వైరస్ ప్రభావం ప్రజలపై విరుచుకుపడడం.. ఒక్క మాటలతో చెప్పలంటే కరోనాకు ముందు… కరోనాకు తరువాత అన్నట్లు ప్రజల జీవితాలు తయారయ్యాయి.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో భారత్‌లో థర్డ్ వేవ్ అనివార్యమైంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన రాష్ట్రాలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడంతో థర్డ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా పడలేదు. అయితే నిపుణులు ఇండియాకు ఫోర్త్ వేవ్ తప్పదని చెబుతున్నారు. ఇటీవల చైనాలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సారి ఫోర్త్ వేవ్ ప్రభావం 75 శాతం మందిపై ఉండే అవకాశం ఉందని, జులై వరకు ఫోర్త్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.