ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రధాని రాజ్యసభ లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అవాస్తవాలను, ఈర్ష్య, ద్వేషాలను కక్కారని ఆయన అన్నారు. ప్రధాని ఇలా మాట్లాడటం సిగ్గు చేటు ఆయన విమర్శించారు. మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలం ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు అబద్దాలు చెప్పటం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం అలవాటైందన్నారు. గ్లోబెల్స్ ప్రచారంలో మోడీకి […]
ముచ్చింతల్‌లో ఏడో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
ప్రధాని మాట్లాడిన మాటలు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు అర్థం అయినట్టు లేదు.. నరేంద్ర మోడీ తెలంగాణకి వ్యతిరేకమని అంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తమ మనుగడ కోసం ఎప్పుడు పడవ మునిగి పోతుందోనని భయంతో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డిని మేము కూడా అనవచ్చు… పొట్టోడు, చిటికెన వేలు అంత లేడని.. గతంలో మాట్లాడిన మీ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని […]
ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుంది బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఆగిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయమని కేంద్ర రైల్వే మంత్రిని కోరానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో ముందుకు రావాలని, కొంత నిధులు కూడా కేటాయించాలని కోరుతున్నానన్నారు. రాష్టంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరానని, విశాఖపట్నం నుంచి వారాణసికి (స్పెషల్ ట్రైన్) […]
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నామని భయమా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు వేరుపడ్డము.. బాగు పడ్డము.. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారని, సుఖ ప్రసవం […]
నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న సమయంలో ఖాళీలు భర్త చేయకపోవడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షల పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీలు మంగళవారం డిమాండ్ చేశారు. జీరో అవర్ ప్రస్తావన ద్వారా సమస్యను లేవనెత్తిన ఎంపీ విజయసాయి రెడ్డి, నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ రంగం ఖాళీలతో నిండిపోతోందని అన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, సాయుధ దళాలలో లక్ష, రైల్వేలో రెండు లక్షలతో సహా కేంద్ర ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది లక్షల […]
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారని, తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని, రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని ఆయన అన్నారు. మోడీ […]
పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ ది అని ఆయన ఆరోపించారు. ఒక్క ఓటు రెండు […]
నిన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో నేడు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న మోడీ తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రత్యకప్రసారం చూడడానికి క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.
తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ (TOSS)కి సంబంధించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన వ్యక్తులు పథకం పొందేందుకు న్యాయం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఇక్కడ అధికారులను ఆదేశించారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అర్హులైన వారికి రూ.20 లక్షలు ఇస్తోందన్నారు. అన్ని వర్గాల పేద […]