Kodanda Reddy : విద్యుత్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి డొమెస్టిక్ పైన 40 నుంచి 50 పైసలు ప్రతీ యూనిట్ కు, అలాగే కమర్షియల్ యూనిట్ కు ప్రతీ యూనిట్ వినియోగంపై రూపాయి నుంచి 1.50 పైసల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు విద్యుత్ పై ఆరు డిమాండ్లను ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కిసాన్ మోర్చా నాయకులు కోదండ రెడ్డిలు మాట్లాడుతూ.. పాత టారిఫ్ పద్ధతిలోనే విద్యుత్ బిల్లులు కొనసాగాలన్నారు.
ప్రభుత్వం బకాయి ఉన్న 13 వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఛార్జీలపై చర్చించాలని, విద్యుత్ సంస్థల అంశంపైన ఒక శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
మా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ సంస్థలకు బకాయిలు లేకుండా చేసామని, విద్యుత్ ఉత్పత్తి పెరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాలు టారిఫ్ తగ్గించాలన్నారు. ఒక నియంత్రణ కమిటీ ఉండాలని, మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా మేము రైతుల పక్షనే మాట్లాడామని వారు వెల్లడించారు. విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, రేగులేటరీ కమిషన్ ప్రతి ఏడాది సమావేశం అవ్వాలని, కమిషన్ ప్రభుత్వంపైన వత్తిడి చేసి వసూలు చేయించాలన్నారు. మీకు అధికారం ఉంది. ప్రభుత్వ బకాయిలు, ప్రైవేట్ బకాయిలు వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలని సూచించారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!