నిమ్స్ ఆస్పత్రిలో స్టాప్ అండ్ కాంటాక్ట్ నర్సుల ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ఆధారంగా పర్మినెంట్ చేయాలని, ప్రస్తుతం ఉన్న జీతాలతో కుటుంబాలు నెట్టుకు రావడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనకు దిగారు. దాదాపు పన్నెండు ఏళ్ల నుంచి ఇక్కడే పని చేస్తున్నామని మొత్తం 423 మంది నర్సులు ఉన్నారని వారు వెల్లడించారు. అంతేకాకుండా ఇందులో 36 మంది గర్భిణీ మహిళలు ఉన్నారన్నారు. జీతాలు పెంచాలని
ఆరు నెలలు మేయర్నిటి లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిమ్స్ ఎమ్ ఎస్ కు తమ సమస్యలను పరిష్కరించాలని సంప్రదించగా మీరంతా కేవలం దిన కూలీలు అంటూ నిర్లక్ష్యం గా సమాధానం చెప్తున్నారని వారు మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే కరోనా కాలంలో సైతం వెనుకడుగు వేయకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడిని వైద్యసిబ్బందికి ఇలాంటి పరిస్థితి రావడం దయనీయమైందని కొందరు అంటున్నారు.