2015-16 నుండి తెలంగాణలో పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాల అభివృద్ధి మరియు ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.309.53 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ.242.19 కోట్లు విడుదలయ్యాయి అని కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం లోక్‌సభలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. స్వదేశ్ దర్శన్ పథకం కింద కేంద్రం ఎకో అభివృద్ధికి కేటాయించిన రూ.91.62 కోట్లలో రూ.87.04 కోట్లు విడుదల […]
ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగం చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. […]
కాలాపతేర్ వద్ద సోమవారం పోలీసు వాహనం డ్రైవర్ మద్యం మత్తులో తన వాహనంతో ముగ్గురు పాదచారులను ఢీకొట్టారు. ఢీకొట్టడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాస్ సాయంత్రం వాహనంలో కాలాపతేర్‌కు వెళ్లే సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. వాహనం తాడ్బన్ క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ అదుపు తప్పి ముగ్గురు పాదచారులను ఢీకొట్టినట్లు సమాచారం. […]
కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టుతుండడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించాయి. అయితే కరోనా నిబంధనలను మాత్రం కట్టుదిట్టంగా అమలు చేస్తూ.. విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కరోనా సెలవుల్లో జరగాల్సిన పరీక్షలు, పరీక్షా ఫీజు చెల్లింపులల్లో గందరగోళం నెలకొంది. దీంతో తాజా యూజీ 1, 3 […]
ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు వార్ నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతుండగా దానికి కౌంటర్‌గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ ట్వీట్‌పై ఉదయం కిషన్‌రెడ్డి ట్విట్టర్లో.. ఎంఐఎంతో ఎవరు చేతులు కలిపినా వాళ్ల వ్యాఖ్యల్ని సమర్థించినట్టేనన్నారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ లక్ష్యంగా వెళ్తున్న మోడీని విమర్శిస్తురా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ట్విట్టర్లోనే కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. […]
తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష, ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జరగనున్నాయి. ఏప్రిల్ 25 […]
ఉప్పల్-ఎల్బి నగర్ రహదారిపై చాలా సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ సమస్య ఈ జూలై నాటికి తీరనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నాగోల్ వద్ద ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్‌ను నిర్మించడంతో త్వరలో చరిత్రగా మారనుంది. 67.97 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ప్లైఓవర్ ప్రారంభించిన తర్వాత ఉప్పల్ నుండి వచ్చే ట్రాఫిక్, నాగోల్ మీదుగా ఎల్బీ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్, ఎల్బీ […]
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీలో కూరగాయలు అమ్ముతున్న బాలుడిని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలని బాలుడి తండ్రితో మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆమె అక్కడకు చేరుకున్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బాలుడిని చూసిన మంత్రి ఆ బాలుడితో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదరు బాలుడిని ఏ స్కూల్లో చదువుతున్నావని అడిగే తాను మోడల్ స్కూల్లో […]
ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో సమక్క సారక్క ప్రసాదాన్ని ఇంటి వద్దకే డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 12- 22 వరకు ఆన్ లైన్లో ఇంటికే ప్రసాదం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… భారత పోస్టల్ సర్వీసు , […]
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)ని ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సింగరేణి ఉద్యోగుల పోరాటంలో రాష్ట్ర నాయకులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన బొగ్గు గనులు తెలంగాణకు పెద్ద ఆస్తులని ఆయన అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ మండిపడ్డారు. నేరుగా సింగరేణికి బొగ్గు గనులు […]