ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ హోల్ సేల్ గా దోచుకుంటుంటే.. ఎమ్మెల్యేలు రిటైల్‌గా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిలో ముందంజలో ఉన్నారని ఆయన […]
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వివిధ ప్రాంతాల నుండి టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్ ద్వారా సుమారు 2,200 బస్సులు నడపబడతాయని, గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని మూడు పాయింట్ల నుంచి 900 బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హైదరాబాద్, కరీంనగర్ జోన్లు) పీవీ మునిశేఖర్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మునిశేఖర్ తెలిపారు. ఈ ద్వైవార్షిక జాతర కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల […]
శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ శ్రీరామానుజ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే తాజాగా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సీఎం […]
తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి లేఖలో ఆరోపించారు. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు […]
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో ఈ ప్రభుత్వం కోత విధించడం సీఎం పెద్ద మనస్సుకు నిదర్శనమా? అల్ప బుద్ధికి నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు. కరెంటు కోతలు వెంటనే నివారించాలని, విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని, […]
సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో యాగశాల కోసం ఎంపిక చేసిన స్థలం, ఆలయ పట్టణాన్ని మూడు నిమిషాల పాటు విహంగ వీక్షణం చేశారు. పెద్దగుట్టలోని హెలిప్యాడ్‌లో దిగే ముందు ముఖ్యమంత్రి యాదాద్రిని ఏరియల్ సర్వే చేసి యాగశాలకు ఎంపిక చేసిన స్థలం, ప్రెసిడెన్షియల్ సూట్లు, కొండవీటివాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పెద్దగుట్ట హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, […]
వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. రజక, నాయీబ్రహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న కానుకను ఈ ఏడాది కూడా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా రూ.285.35 కోట్ల ఆర్థిక సాయంను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు బటన్ నొక్కి లబ్దిదారుల లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 చొప్పున ఆర్థిక సాయాన్ని ఏపీ […]
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. “పోలీసులను 15 నిమిషాలు తొలగిస్తే, మేము ముస్లింలు 100 కోట్ల హిందువులను అంతం చేస్తాం” అన్న ఒవైసీ, ఎంఐఎంతో సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు కలిసి పొత్తుపెట్టుకోవడం […]
ఇటీవల కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంబేద్కర్ పెట్టిన బిక్ష అని అన్నారు. అంతేకాకుండాఅలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఎలా అనిపించిందని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా రాజ్యాంగము ఏ ఒక్కరిదీ కాదని, అందరికీ సమనాహక్కులు కల్పించింది రాజ్యాంగమని ఆమె వెల్లడించారు. రాజ్యాంగము మార్చాలనే అహంకారం ఎక్కడి నుండి వచ్చిందని ఆమె మండిపడ్డారు. కావాలంటే ఆమైంద్ మేంట్స్ […]
మహిళను బానిస లాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ ది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. . ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసింది రాజ్యాంగము అని, రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలని అనుకుంటున్నావు కేసీఆర్, అందరికీ సమాన హక్కులు..వాక్ స్వతంత్రం.. భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అని ఆయన ఆరోపించారు. మోడీ పర్యటన.. అంతా రామానుజ చార్యుల […]