గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతావని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా) సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో ఫ్లాష్ న్యూస్‌గా ప్రసారమవుతున్నాయి. ఇది చూసిన సైనికుల కుటుంబాలలో ఏదో తెలియని భయం.. ఆ భయంతోనే భారత సైనికదళంలో ఉన్న తమతమ వారికి ఫోన్ చేసి తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు […]
మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదైంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్లు విధించాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 34,113 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18 […]
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు యూపీ, గోవా లో పోలింగ్ ప్రారంభం కాగా, ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. అయితే మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. […]
నేటి సమాజంలో మొబైల్ తెలియని వారు లేరు. అందులో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండనే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో దుమ్మురేపుతున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒక ప్రధాన అప్డేట్లో, వినియోగదారులు వారి వాట్సాప్ ప్రొఫైల్‌ల కోసం కవర్ ఫోటోలను సెట్ […]
కర్ణాటకలో హిజాబ్‌పై వివాదం చేలరిగి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హిజాబ్’ ‘పర్దా’లకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకు రావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పేర్కొంది. “నా ప్రియమైన సోదరీమణులారా, హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణచివేయబడలేదని, కానీ దానితో గౌరవంగా మరియు స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని […]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించారు. 25 గంటలపాటు కౌంట్‌డౌన్ ముగించుకుని సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించిన రాకెట్ నింగిలో లక్ష్యం దిశగా వెళ్లింది. ఇది మూడు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తోంది. ఇస్రో ఈ ఏడాదిలో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఇస్రో శాస్త్రవేత్తలను […]
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ చేయడంలో కొత్తకొత్త పంథాలను తొక్కుతూ పోలీసులకు చిక్కి జైలు ఊసలు లెక్కెడుతున్నారు. అయితే ఈ రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్డ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని గేట్ నెంబర్ 11 వద్ద అనుమానాస్పద కవర్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆ కవర్‌ను జాగ్రత్తగా తెరిచిచూడడంతో అందులో 51 క్యాపసల్స్ లో నింపిన కొకైన్‌ను గుర్తించారు. దీంతో మరోసారి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం […]
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధానిపై కలకలం రేగింది. దీంతో ఎంతో మంది రైతులు, తదితరులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకుంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే […]
జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇప్పుడు కేంద్రం మరో ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇటీవల […]
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు తమ నదులలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలతో పోరాడుతున్న తరుణంలో, హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన నీటి వనరులైన మూసీ, హుస్సేన్ సాగర్ నదులు కాలుష్యం నుంచి బయటపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా మూసీ నది, హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత చాలా మెరుగుపడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB), హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) సహా […]