Annapurna Studios : అన్నపూర్ణ స్టూడియోస్’లో A&M మోషన్ క్యాప్చర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారతీయ సినీ పరిశ్రమకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశంలో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సదుపాయాన్ని ఆవిష్కరిస్తూ, ఇండియన్ సినిమాల సృజనాత్మకతకు, సాంకేతికతకు కొత్త దిశను చూపింది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, విజనరీ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్థాపించిన మిహిరా విజువల్ ల్యాబ్స్ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటీకి A&M MoCap Lab అని పేరు పెట్టారు. హాలీవుడ్‌లో ప్రముఖ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ భాగస్వామి అయిన Animatrik Film Design ఈ ల్యాబ్‌కు టెక్నికల్ పవర్ అందించింది. ఫిబ్రవరి 20న ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేతుల మీదుగా ఈ ల్యాబ్ ఫెసిలిటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం “వారణాసి”లో కీలక సన్నివేశాలను ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చిత్రీకరించినట్టు ఆయన వెల్లడించారు. భారతీయ కథనాల స్థాయి, విజన్‌ను ఈ టెక్నాలజీ ఎలా మార్చబోతోందో కూడా వివరించారు.
Also Read : Vrushakarma : మార్చి 5న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
రాజమౌళి మాట్లాడుతూ ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ దేశీయ దర్శకులకు కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. “ఇప్పటివరకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. బాహుబలి, ఈగ వంటి సినిమాల సమయంలో ఈ సదుపాయం భారత్‌లో ఉంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దేవాళ్లమని అనిపిస్తోంది. ఇప్పుడు ఆ లోటు తీరింది,” అని చెప్పారు. అలానే కింగ్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ,.. భారతీయ సినిమా ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టం. “ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనే కల భారతీయ దర్శకులకు ఎప్పటి నుంచో ఉంది. కానీ అత్యాధునిక సాంకేతిక వసతులు కొరతగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్ అడ్వెంచర్ నుంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చు,” అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?