దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని మరో నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ ప్రసాద్ చివరి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. విచారణ సందర్భంగా కోర్టులో భౌతికంగా హాజరు కావడానికి ఆర్జేడీ అధినేత ఆదివారం రాంచీకి వచ్చారు. లాలూ ప్రసాద్‌కు సంబంధించిన రూ.139.35 కోట్ల డోరండా ట్రెజరీ […]
2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్‌నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద […]
వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ఎన్నికల బరిలో ఉండగా.. యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో హిందువులంతా ఏకమవ్వాలని ఆయన అన్నారు. యోగి అదిత్యనాథ్‌కు ఓటు వేయని ప్రాంతాలను […]
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ‘హిందూస్థాన్, పాకిస్థాన్’ అనేది బీజేపీ జీవితకాల నినాదమని, ‘వీరి నాయకులకు జ్ఞానం లేదని’ ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తలసాని.. గత మూడేళ్లలో హైదరాబాద్‌కు కిషన్ ఏం చేశారని ప్రశ్నించారు. వరద సాయం కోసం కూడా కిషన్ ఒక్క రూపాయి […]
ఆదివాసి కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క జాతరకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడారం జాతరకు నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు సమక్క సారక్కలను దర్శించేందుకు వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణకే సమక్క సారక్క జాతర తలమానికంగా నిలిచింది. అయితే మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీస్ శాఖ 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో […]
కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోనే అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ‘ప్రభలు’ […]
మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదైంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్లు విధించాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 27,409 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 347 మంది కరోనాతో మరణించారు. […]
స్మగ్లింగ్ చేసేందుకు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తీరా అధికారులకు దొరికి జైలుపాలవుతున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సొమాలీయన్ దేశానికి చెందిన మహమూద్ అలీ అనే వ్యక్తి షార్జా వెళ్లేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్‌ను తన లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించేందుకు యత్నించాడు. అయితే మహమూద్ అలీపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అతడితో […]
రాష్ట్రంలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6,91,530 మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందారని, మూడో దశలో […]
మహబూబ్‌నగర్, నల్గొండ పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (UDAలు) ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ చక్కటి సమగ్ర మరియు ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్డు నెట్వర్క్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు మరియు శాటిలైట్ […]