బహదూర్‌పురా వద్ద ఆరు-లేన్ల ద్విదిశాత్మక ఫ్లైఓవర్ వేగంగా పూర్తవుతోంది. ఈ సౌకర్యం దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని వేధిస్తున్న ట్రాఫిక్ గందరగోళాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉందని, మార్చి 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు తెలిపారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను జీహెచ్ఎంసీ రూ.69 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. 690-మీటర్ల […]
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ థర్డ్ వేవ్ నుండి బయటపడేందుకు తెలంగాణ విజయవంతంగా చర్యలు చేపట్టడంతో పాటు మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు, మెడికల్ కాలేజీలు, దాదాపు అన్ని ప్రధాన తృతీయ శ్రేణి ఆసుపత్రులను రూ.6,000 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం […]
నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. రోజుకు 15 వేల చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. మరోసారి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నేడు ఇన్పుట్ సబ్సిడీని అందజేయనుంది. ఈ రోజు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేయనున్నారు. ఏపీలో నేటి నుంచి జెన్కో సంస్థల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ చేయనున్నారు. […]
విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని మంత్రుల బృందం సోమవారం సందర్శించింది. మంత్రులు పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ లతో పాటు అధికారులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిధులను గ్రీన్ ఛానల్ లో పెడతాం అని సీఎం హామీ ఇచ్చారని, 12.5 అడుగుల మోడల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 25 అడుగుల నమూనా విగ్రహం త్వరలో పెడతామని, […]
పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో పురోగతి కనిపించింది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాతి కాలేజ్ లో పేపర్ లీకైనట్లు ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజ్ పై ఆపరేషన్ జరుగుతోంది. స్వాతి కాలేజ్ పేపర్ లీకేజి ఘటనలో నలుగురు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు కాలేజ్ సిబ్బందితో పాటు అబ్జర్వర్‌ను సైతం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పరీక్షకు అరగంట ముందు పేపర్ లీక్ జరిగిందని, స్వాతి […]
కోవిడ్ టైంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక […]
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి టైమ్స్ ఇంటర్నెట్-బ్యాక్డ్ డైనింగ్ అవుట్ ప్లాట్‌ఫారమ్ డైనౌట్ను దాదాపు 200 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు సోమవారం ఇక్కడ తెలిపాయి. డైనౌట్ ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ క్రెడ్‌తో కూడా చర్చలు జరుపుతోంది, అయితే స్విగ్గీ స్పష్టంగా రేసును గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే స్విగ్గీ-డైనౌట్ ప్రతినిధులు చర్చలు ఇప్పుడు 200 మిలియన్ డాలర్ల పరిధిలో (Dineout యొక్క ప్రస్తుత విలువ ప్రకారం) కొనుగోలు కోసం […]
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, అతి త్వరలో అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలకు […]
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఈ యాప్‌ల కార్యకలాపాలను నిషేధిస్తూ అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రతికూల భద్రతా ఇన్పుట్లు రూపొందించబడిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్డి, బ్యూటీ కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్ మీడియా అన్ని ఫార్మాట్లు, […]
ఫిబ్రవరి 14 వచ్చిదంటే చాలు.. పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేయసి వెంట ప్రియుడు గులాబి చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అని ఫాల్ అవుతుంటే.. వెనకాలే.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటల వెనుక.. మేము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంతో ఫిబ్రవరి 14 అంతా వివైధ్య సంఘటనలు పార్కుల వద్ద దర్శనిమిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ప్రేమజంటలకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రేమికుల […]