The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు విడుదలైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట రిలీజ్ అయిన కొద్దిసేపటికే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.
READ ALSO: Hair Loss: బయోటిన్‌తో జట్టు రాలడానికి చెక్..! నిజమేనా..?
Also Read
అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్, శ్రీకాంత్ ఒడేలా మాస్ మేకింగ్, నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. ఈ మూడు కలిసి పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయని నెట్టిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పాటలో నాని ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నారు.ఈ సినిమా 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అణచివేతకు గురైన ఒక తెగ హక్కుల కోసం పోరాడే యోధుడి పాత్రలో నాని కనిపించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా నాని బర్త్ డే కానుకగా విడుదలైన ఆయా షేర్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్, 5 లక్షల పైచిలుకు లైక్స్ సాధించి యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “ది ప్యారడైజ్ ” చిత్రం ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ మాస్ మూవీ కాబోతోందని ఆయన ఫ్యాన్స్‌తో సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Bill Gates : ఎప్‌స్టీన్ వివాదం.. తప్పు ఒప్పుకున్న బిల్‌గేట్స్.. కానీ!
తాజావార్తలు
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!