Balka Suman: రోషం, పౌరుషము ఉంటే సంజయ్ రాజీనామా చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ లోని పబ్ పై పోలీసులు చేసిన దాడి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పబ్ పై టాస్క్
ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మేనల్లుడు, బీజేపీ నాయకురాలు కుమారుడు ఈ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్
మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ వ్యవహారంలో వారి నాయకులు, పిల్లలు ఉన్నారు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి తమ అధ్యక్ష పదవులు కి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గంజాయి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మనిషివి.. రోషం, పౌరుషము ఉంటే సంజయ్ రాజీనామా చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. నువ్వు చేతగాని దద్దమ్మవి, నువ్వు ఏమి చేస్తున్నావో అందరికి తెలుసు అంటూ ఆయన ధ్వజమెత్తారు. విచారణ సాఫీగా జరగాలంటే రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, నీ మేనల్లుడును కంట్రోల్ చేయలేని వాడివి.. నువ్వు ఏమి చేస్తావన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రగ్ కల్చర్ కి అలవాటు పడ్డారని, ఉప్పల అభిషేక్ ను షూట్ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లే చేసి వాళ్ళే ధర్నాలు చేస్తారని, పబ్ లలో డ్రగ్స్, కొకైన్ వాడడం తప్పు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిజ స్వరూపం బయట పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
https://ntvtelugu.com/raja-singh-fired-on-balka-suman/
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!