తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే తాజాగా ఎడ్ సెట్ షెడ్యూల్ ను విద్యా శాఖ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎడ్ సెట్ కోసం ఈ నెల 7 నుండి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా జూన్ 15 దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొంది. దీంతో పాటు రూ.500 లేట్ ఫీ తో 15 జులై వరకు దరఖాస్తుకి అవకాశం కల్పించింది. అయితే దరఖాస్తు ఫీ రూ.600 ఉండగా ఎస్సీ, ఎస్టీలకి రూ.450లుగా తెలిపింది.
డిగ్రీ, ఇంజనీరింగ్ లో 50 శాతం మార్క్స్ తో పాస్ అయిన వారు దరఖాస్తు కి అర్హులని, ఎస్సీ, ఎస్టీ బీసీ లకు 40 శాతం అర్హతగా వెల్లడించింది. ఎంబీబీఎస్ లాంటి వైద్య విద్యా కోర్సులు చేసిన వారు బీఎడ్ కి అనర్హులుగా ప్రకటించింది. జులై 26, 27 తేదీల్లో ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందని, 19 రీజినల్ సెంటర్ లు… 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
https://ntvtelugu.com/dung-cakes-fight-celebrated-grandly-at-kurnool/