సీఎం జగన్పై మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్.. మూడేళ్లు పూర్తి కాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్ గా వున్న ఏపీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, […]
మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం గులాబీ గూటిలో ఉన్న నేతల మధ్య విభేదాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నేడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో రసాబాసగా మారింది. సమావేశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బాయ్ కట్ చేశారు. అధికార పార్టీ మేయర్ సామల బుచ్చిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవి గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ బయట నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ […]
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ […]
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని […]
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6 […]
పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5 […]
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. సమ్మక్క-సారక్కలు గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి కన్నుల పండువగా దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీస్ శాఖ 9 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు […]
అహ్మదాబాద్లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 77 […]
బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి […]
ఈ నెల 24 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ హరినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఎస్ఎఫ్ఐ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బస్సు యాత్ర ప్రారంభం కానుంది. శ్రీకాకుళం టు హిందూపురం వరకు విద్యారంగ పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ […]