రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమక్క-సారక్క జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇలా మేడారం జాతరకు బయలుదేరిన ఓ కుటుంబ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. ఎంతో ఆనందంగా అమ్మవార్ల దర్శనం కోసం ఇంటి నుంచి మేడారంకు కారులో ఓ కుటుంబం బయలు దేరింది. అయితే ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును కారు […]
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతర తుదిదశకు చేరుకుంది. ఈ నెల 16న ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ వైభవోపేతంగా జరుగుతోంది. సమ్మక-సారక్క జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ భక్తులు విచ్చేశారు. అమ్మవార్లకు బంగారాన్ని (బెల్లం) సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను రాజకీయ ప్రముఖలు కూడా ఇప్పటికే దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యలో నేడు తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా అమ్మవార్లను దర్శించుకోనున్నారు. […]
ఏపీ ప్రభుత్వం ఇటీవల డీజీపీ ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు బదిలీపై వెళుతున్న గౌతమ్ సవాంగ్‌కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 36 ఏళ్ళ నా పోలీసు సర్వీస్ ముగింపుకు వచ్చిందని ఆయన అన్నారు. రెండేళ్ళ 8 నెలల పాటు రాష్ట్ర డీజీపీగా పని చేసే అవకాశం ముఖ్యమంత్రి ఇచ్చారని, అందుకు సీఎం కు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. సీఎం ఆదేశాలకు […]
ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీగా ఉన్న సవాంగ్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. నాపై ఉన్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని, ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా […]
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. అయితే ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర నేటితో ముగియనుంది. నేడు అమ్మవార్లు వనప్రవేశంతో మేడారం జాతర తుదిదశకు చేరుకోనుంది. అయితే అమ్మవార్లను ఇప్పటికే రాజకీయ ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా నేడు సమక్క-సారక్క […]
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున పోలీసుల దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. సైఫాబాద్ నుండి ఓ కారులో మహిళలు నాంపల్లి వైపు వెళుతుండగా బస్సుకు వారు ప్రయాణిస్తున్న కారు కు మైనర్ ఆక్సిడెంట్ జరిగింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. అయితే ఇంతలోనే స్పాట్ కు చేరుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్ ఓ కానిస్టేబుల్ లాఠీతో మహిళలను కొట్టారు. దీంతో అక్కడికి పెద్దఎత్తున చేరుకున్న […]
ప్రయివేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు త్వరలో కొంత ఉపశమనం కలుగనుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోగా, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన […]
హైదరాబాద్‌లో బైక్, కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఎంతో మంది సతమతమవుతున్నారు. దీంతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో తీపికబురు చెప్పనున్నారు. హైదరాబాద్‌లో చాలా రోజులుగా ఎంతో మంది వారి వాహనాలపై ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉండడంతో భారీగా చలాన్లు అలాగే ఉండిపోయాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే చలాన్లపై ఎంత రాయితీ ఇవ్వలన్నదానిపై పోలీస్ ఉన్నతాధికారులు […]
శ్రీశైలంలో నేడు మూడో రోజు శ్రీమల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. నేడు ఏపీ డీజీపీగా కె.వెంకటరాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఎపీపీఎస్సీకి చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. నేడు ఇండోర్‌లో గోబర్ దాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. నేడు గుజరాత్లో […]
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండడం లేదని, ఇంకా వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 26 వేల కోట్లకు పైగా అప్పులు.. ఛార్జీలు […]