విజయవాడ హిజాబ్ వివాదంపై లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ కిషోర్ మాట్లాడుతూ.. ఇవాళ తరగతిగదిలో ఇద్దరు హిజాబ్ ధరించి వచ్చారు. నేను తరగతి గదులకు రౌండ్ కు వెళ్ళినప్పుడు ఇది గమనించాను. కళాశాలకు హిజాబ్ ధరించి వస్తున్నారేంటని ప్రశించాను. తరగతి గదిలో విద్యార్థులు అందరూ యూనిఫామ్ తోనే ఉంటారు. ఇద్దరు విద్యార్థులను పిలిచి మాట్లాడాను..వారి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. కళాశాలలో చేరేటప్పుడు ఇక్కడి నిబంధనలు పాటిస్తామని సంతకం చేస్తారు. కలెక్టర్ ఆదేశాలతో […]
అస్సాం సీఎం రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు […]
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడడానికి ఉందా… ప్రతి పక్ష నేతల అరెస్ట్ లకోసమే పనిచేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. మహిళా నాయకురాళ్లను రాత్రి వరకు పోలీసు స్టేషన్ లలో ఉంచారని ఆయన విమర్శించారు. తెలంగాణా లో ఉన్నామా…నార్త్ కొరియా లో […]
సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డిపై టీడీపీ మహిలా నాయకురాలు వంగలపూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. షర్మిల, విజయమ్మ, సునీతలకు పట్టిన గతి భారతికి పట్టకూడదని కోరుకుంటున్నాని ఆమె అన్నారు. సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాల్లో సహధర్మచారిని భారతిని బలిచేస్తున్నారన్నారు. జగన్ భార్య అయినందుకు ఆమె కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోందని, జగన్ అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆస్తులకు భారతిని యజమానురాలుగా పెట్టడంతో ఆమె పరిస్థితి చూస్తే జాలేస్తోందని ఆమె అన్నారు. […]
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించి విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు హజరుకావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ హిజాబ్ అంశం ఏపీకి పాకింది. ఇదే తరహాలో బెజవాడలో కూడా ఓ ఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందని ఓ కాలేజీ యాజమాన్యం బుర్కా వేసుకొచ్చారని కొంత మంది ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఫస్ట్ ఇయర్ నుంచి తాము బుర్కాలోనే కళాశాలకు హజరవుతున్నామని, […]
ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధర వ్యవహారం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సినిమా టికెట్ల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రికమెండేషన్లు సిద్ధమయ్యాయి. ఇవాళ్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భౌగోళిక క్యాటగిరీలో జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాలు కాకుండా మూడు ప్రాంతాలుగానే కమిటి సిఫార్సు చేసింది. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ కలిపి నగర పంచాయతీ ఏరియాగా సిఫార్సు చేసినట్టు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్, […]
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌తో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల ముందు ధర్నాకు తెలంగాణ పీసీసీ పిలుపు ఇచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు. ఆయన నివాసం ముందు బారికేడ్లు పెట్టి.. పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ […]
ఎన్ని చట్టాలు చేసిన, ఎంత కఠినంగా శిక్షించిన కామాంధులు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. విద్యాబుద్దులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే తమ ఆ స్థానానికి తీరని మచ్చను తీసుకువస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు విద్యార్థినీల పట్ల కామాంధులైన ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చిన ఉదాంతాలు ఉన్నాయి. అయితే తాజాగా విజయనగరం ఏజేన్సీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరంలో జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు స్కూల్లో విద్యార్థినీలతో ఇద్దరు ఉపాధ్యాయులు […]
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ (85) ఈ రోజు ఉదయం పరమపదించారు. అయితే గత కొంతకాలంగా లింగ్యా నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క-సారక్క జాతర పర్యవేక్షణలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె […]
తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర వైభవోపేతంగా జరుగుతోంది. నిన్న ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చేసింది. మేడారం జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది. మేడారం జాతారను ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.