తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇసుక సంపదను కర్ణాటకకు చెందిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు… తాజాగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామ అ సమీపంలో ఉన్న కాగ్నానది పరివాహక ఈ ప్రాంతంలో పక్కనే ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు తెలంగాణ ప్రాంతంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న బషీరాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయాలు గ్రహించారు. ఈ విషయం తెలుసుకున్న ఇసుక అక్రమార్కులు అక్కడే ఇసుకను తవ్వకాలకు ఉపయోగించే పెద్ద హిటాచి ( జేసీబీ) ని మరికొన్ని పనిముట్లను వదిలిపెట్టి పరారయ్యారు.
ఆ యంత్రాలను పనిముట్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.. గతంలో కూడా ఈ తంతు కొనసాగుతూనే ఉంది కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కర్ణాటకకు చెందిన అక్రమ ఇసుక వ్యాపారులతో ఒప్పందం చేసుకొని స్థానికంగా ఉన్న కొంతమంది అధికారుల జేబులు నింపుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సిన సహజ సంపదను పక్క రాష్ట్రానికి మళ్లిస్తున్నారు.. ఈ తంతు మొత్తం కొంతమంది జిల్లా స్థాయి అధికారులకు బడా రాజకీయ నాయకులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంపదను కాపాడుకోవాలని ప్రజలు కోరుతున్నారు.