పిల్లలు పాఠశాలకు వచ్చేందుకు, పాఠశాలపై ఆసక్తి చూపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పెయింటింగ్స్ తో నింపనుంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఇష్టపడే కార్టూన్లు, జంతువులు, నైతిక విలువలు తెలిపే చారిత్రక నిర్మాణాలతో అందమైన పెయింటింగ్‌లు, చిత్రాలతో, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో గోడలు, భవనాలు, తలుపులు, కిటికీలు త్వరలో విద్యార్థులకు అభ్యాస సామగ్రిగా మారనున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం […]
నేడు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో సమావేశం కానున్నారు. సమావేశానికి హజరుకావాలని 240 మంది సభ్యులకు ఆహ్వానం పంపించారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత తొలిసారి సమావేశం కానున్నారు. నేడు సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సీఎం కేసీఆర్ కలువనున్నారు. […]
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ టీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేయడంతో ధర్పల్లి మండలంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని టీఆర్ఎస్ […]
వివేకా హత్యకేసులో అడ్డంగా దొరికి కూడా సలహాదారులు బ్లాక్మెయిల్ చేస్తూ, స్టేట్మెంట్లు ఇస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణను సజ్జల తప్పుపట్టడం బరితెగింపేనని ఆయన విమర్శించారు. అంతేకాకుండా హత్యకు ప్రధాన కారణం అవినాష్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసినా.. ఇంకెంతసేపు బొంకుతారనని ఆయన వ్యాఖ్యానించారు. హత్య చేసిన వారిని, చేయించిన వారిని కాపాడే ప్రయత్నం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా […]
టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావాదేవీలు బయట పడ్డాయని తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా…? ఈ విషయాలు అన్ని ఎస్వీబీసీ లైవ్ ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. ఉదయస్తమాన సేవా టికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లైవ్ ద్వారా అందరూ […]
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్‌కు తెరపడినట్లు కనిపిస్తుంది. తాజా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాసేపట్లో సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. పార్టీలో ఎవరు మాట్లాడలేని సందర్భంలో రాహుల్ గాంధీ సభ పెట్టించానని ఆయన తెలిపారు. నా భార్య నీ […]
దేశ అభివృద్ధికి మంచి రోడ్లు కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో 2 వేల 482 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ లో 2 వేల 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని ఆయన వెల్లడించారు. 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్క పెద్దపల్లి […]
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ (Windows 11 Pro) ఎడిషన్‌ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుండి పీసీ (PC)ని డిస్కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి ఎంఎస్ అకౌంట్ […]
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వని వారు ఇక్కడ రాజకీయ లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతూన్నారో తెలియదని, అమ్మ సన్నిధిలో పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారన ఆయన విమర్శించారు. ఎడేల్లు గా పాలన చేస్తున్న మోది మేడారం జాతరకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి గుడికి వెళ్లే ప్రధాని […]
రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కైవాక్ మరో మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్మిస్తున్న లూప్ ఆకారపు సదుపాయం రాజధాని నగరంలో మరో ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్‌గా నిలుస్తుంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని మే 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారి తెలిపారు. “నిర్మాణం యొక్క స్తంభాలు వేయబడ్డాయి. డెక్ భాగం యొక్క 60 […]