నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో హీరో రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు నమోదు అయింది. కోకాపేట్‌లోని విల్లాలో నివాసం ఉంటూ తనపై దాడి జరిగిందని లావణ్య ఫిర్యాదు చేశారు.
కవిత టార్గెట్ ఆ ఇద్దరేనా? ఇక ఫైనల్ లెక్కలు తేలిపోయినట్టేనా? తండ్రి దేవుడు, అన్నకు జాగ్రత్త అంటూ సూచనలు... హరీష్‌రావు, సంతోష్‌రావు మీద తీవ్ర ఆరోపణలు. సో... పిక్చర్ క్లియర్ అయిపోయినట్టేనా? దాని గురించి బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి?
ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఖమ్మం ప్రత్యేకమైన స్థానం ఉందని గుర్తు చేస్తూ 1969లోనే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఖమ్మం అని ఆయన అన్నారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ట్విన్ సిటీలు సహా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది.
సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు.
ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా! ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల […]
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు.