CM Revanth Reddy : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ముంపు ప్రాంతాలను పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్, అమీర్‌పేట్ ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని గంగుబాయి బస్తీ, బల్కంపేట్‌లోని ముంపు ప్రభావిత కాలనీల్లో ప్రజల పరిస్థితి, నష్టాలను పరిశీలించారు. ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో సీఎం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ మరియు సంబంధిత అధికారులను వెంటబెట్టుకొని పర్యటించిన […]
Engineering Admissions 2025 : రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 91,649 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 80,011 సీట్లు కేటాయించబడ్డాయి. ఇందులో కొత్తగా 4,720 మంది అభ్యర్థులు సీట్లు పొందగా, 20,028 మంది స్లయిడ్ అయ్యారు. ఇంకా 11,638 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 6,085 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తం 51 కళాశాలల్లో (5 యూనివర్సిటీలు, 46 […]
Bhatti Vikramarka : మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అతిథిగా పాల్గొనగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మధిర నియోజకవర్గంలో […]
Kidnap Case : కన్న తండ్రి కసాయిగా మారాడు. సొంత బిడ్డని ఏకంగా బిచ్చగాళ్లకు అమ్మేశాడు. బిచ్చగాళ్ళ మాఫియా పాపను కొనుగోలు చేసి రాజమండ్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఈలోగా తన పాప కిడ్నాప్ అయిందన్న తండ్రి డ్రామాతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు, రైల్వే పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. కేవలం 6 గంటల్లోనే పాప మిస్సింగ్ కేసును ఛేదించారు. ఇందుకోసం […]
Pr*stitution : విదేశీ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్న ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకు వచ్చి.. గలీజ్ పనులు చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న ఓ యవతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. అసలు ఈ ముఠా ఏంటి? ఎంత కాలంగా వీళ్లు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన రూప, హైదరాబాద్‌లోని బండ్లగూడ, […]
Cyber Fraud : ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురితో వ్యవహారం నడుపుతూ పెద్దాయన ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ ఆనందంలో ఆ ఇద్దరు అడిగినంత డబ్బులు పంపిస్తూ వెళ్లాడు. అయితే అతడి కుటుంబసభ్యులు డబ్బులు ఏమయ్యాయని నిలదీయడంతో అతడు చేస్తున్న యవ్వారం బయటపడింది. కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల మోసం వెలుగులోకి వచ్చింది. అలా రంగంలోకి దిగిన సైబర్ కేటుగాళ్లకు అప్పుడప్పుడు బాగానే గిట్టుబాటు అవుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ వృద్ధున్ని […]
Ganja : గంజాయి స్మగ్లర్లు.. పోలీసులకు దొరకకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కార్లలో గంజాయి తరలిస్తూ..ముందు ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే తరహాలో ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. మొత్తంగా 250 కిలోల గంజాయి సీజ్ చేశారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. తమ అక్రమ దందాకు బ్రేకులు లేవనే విధంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఏపీలోని […]
Playing Cards : సాధారణంగా మహిళలకు సీరియల్స్ చూడడం ఇష్టం ఉంటుంది. చీరలు, గాజులు, నగలు పెట్టుకోవడంపైన మోజు ఉంటుంది. సీరియల్స్ విషయంలో కొంత మంది మహిళలు పిచ్చిగా ఉంటూ ఉంటారు. అంతే కాదు సీరియల్స్‌ను వ్యసనంగా మార్చుకుంటారంటే కూడా అతిశయోక్తి లేదు. అలాంటి మహిళలు కొంత మంది ఇప్పుడు పేకాటకు కూడా బానిస అవుతున్నారు. భర్తను పట్టించుకోకుండా పేకాట ఆడుతున్నారు. ఇలాంటి ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఈ పాట పురుషులు పేకాడుతున్నప్పుడు వాడుకోవచ్చు. […]
Nityapelli Koduku : ఖాకీ చొక్కా వేసుకున్న కామాంధుడు.. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.. దీంతో సూర్యాపేట పోలీస్ ఉన్నతాధికారులు… ఆ కానిస్టేబుల్ కామాంధుడి తొక్క తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఫోటోలో అమాయకంగా బొట్టు పెట్టుకుని చూస్తున్న వ్యక్తి పేరు కృష్ణం రాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. […]
Shocking : వికారాబాద్ జిల్లా రాంపూర్ తండాలో జరిగిన దారుణ ఘటనలో కోడి కోసం జరిగిన కొట్లాట ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికంగా నివసించే మోహన్ అనే వ్యక్తి, మరో కుటుంబానికి చెందిన కోడిని కొట్టి చంపాడు. ఈ సంఘటన తర్వాత కోడి మీద జరిగిన దాడి కారణంగా, మోహన్‌పై తిరుగుబాటు చేసిన మరో కుటుంబం అతనిపై తీవ్రంగా దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన మోహన్, ఈనెల 4న ఆస్పత్రిలో చేరి చికిత్స […]