HYDRA : డ్రోన్ల ద్వారా చిక్కుకున్న వారికి ఆహారం పంపిణీ
- చాదర్‌ఘాట్, మూసారంబాగ్ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
- డ్రోన్ల ద్వారా చిక్కుకున్న వారికి ఆహారం పంపిణీ
- ఎంజీబీ ఎస్ వద్ద రిటైనింగ్ వాల్ కూలిన ప్రాంతాల పరిశీలన
- దసరా సందర్భంగా అప్రమత్తంగా DRF బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీ ఎస్ పరిసరాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు. చాదర్‌ఘాట్‌లో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన కమిషనర్, స్థానికులకు నీటి మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
NTR-Kantara: టైగర్ రోర్స్.. ఒక్క ఈవెంట్, ఎన్నో అప్డేట్స్!
Also Read
భవనాలపై చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం అందజేస్తున్న విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఎంజీబీ ఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో వరద ప్రవేశించిన ప్రాంతాలను కూడా కమిషనర్ పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా DRF సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
అలాగే శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీ ఎస్ ప్రాంగణంలోకి వరద ప్రవేశించిన సమయంలో చేపట్టిన తక్షణ సహాయక చర్యలను ఆయన అభినందించారు. మూసీ వరదల దృష్ట్యా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కొనసాగినప్పటికీ సాయంత్రం నాటికి నీటి మట్టం తగ్గే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. అయినా అప్రమత్తంగా DRF బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!