ఆ నియోజకవర్గంలో గులాబీ కేడర్ బలంగానే ఉన్నా…. నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ… కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో…లోకల్‌గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా […]
Tragedy : వివాహేతర బంధాలు హత్యకు దారి తీస్తున్నాయి. దేశంలోని ఏ కేసు తీసుకున్నా.. ఇదే జరుగుతోంది. తాజాగా కరీంనగర్ శివారులో జరిగిన ఓ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర బంధమే కారణమని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ శివారు ప్రాంతంమైన బొమ్మకల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద జులై 29న ఓ డెడ్ బాడీ కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి డెడ్ […]
POCSO : హైదరాబాద్‌లో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. దత్తత తీసుకున్న తల్లి చనిపోవడం, తండ్రి అనారోగ్యంతో మంచాన పడి.. మైనర్ బాలిక ఒంటరిగా ఉంటోందని గమనించిన యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. ఏకంగా ఆమె ఇంట్లో సహజీవనం చేయడం ప్రారంభించాడు. కానీ బాలిక అసలు తల్లికి విషయం తెలియడంతో యువకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు రవితేజ. మేడ్చల్ జిల్లా […]
Hyderabad Crime : హైదరాబాద్‌లో పోకిరీల హాంగామాకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. అర్థరాత్రి రోడ్ల మీద నానా హంగామా చేస్తూ జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో జోగుతూ.. నడి రోడ్డుపై కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇలా నానా న్యూసెన్స్ చేస్తున్న పోకిరీల ఆట కట్టించాలని సిటీ జనం కోరుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో జరిగింది. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న ముజఫర్ అనే యువకుడు తన బర్త్ డే పార్టీ కోసం మిత్రులను ఆహ్వానించాడు. […]
Srushti Case: హైదరాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇప్పుడు ఆమెను కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 86 మంది సరోగసీ దంపతుల వివరాలను సేకరించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. […]
Shocking : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు కలిగిస్తోంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. తాజా అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 2000 నుంచి రెట్టింపు కాగా, 2060 నాటికి ఇది మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. న్యూమెక్సికోలో 2016 మరియు 2024లో మరణించిన వ్యక్తుల మెదడు కణజాలాన్ని పరిశీలించిన […]
Kishan Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన జంతర్ మంతర్ సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ బీసీల సమస్యలకన్నా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతోనే రేవంత్ ఢిల్లీ సభ పెట్టుకున్నాడు. 31 నిమిషాల ప్రసంగంలో సగానికి పైగా రాహుల్, సోనియా పేర్లే జపించాడు” అని విమర్శించారు. “బీసీ […]
తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ జోరు పెరిగిపోయిందా? కొందరు నాయకులకు గులాబీ రంగు మీద మొహం మొత్తి కాషాయంపై మనసు పారేసుకుంటున్నారా? అట్నుంచి కూడా కొంచెం టచ్‌లో ఉంటే… చెబుతామన్న సమాధానం వస్తోందా? తెలంగాణలో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్న నాయకులెవరు? ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. శరవేగంగా మారుతున్న పరిణామాలు కూడా అదే […]
తెలంగాణలోని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? తన కళ్ళెదుటే తన్నుకోబోయిన పార్టీ నేతల్ని ఆమె ఎలా సెట్ చేస్తారు? ఏం చెప్పి వాళ్ళని మారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ తన్నులాటలు పార్టీ పుట్టి ముంచుతాయా? అలా జరక్కుండా తేల్చడానికి మంత్రి దగ్గరున్న మంత్ర దండం ఏంటి? అంత దారుణమైన పరిస్థితులున్న ఆ జిల్లా ఏది? సవాల్ ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇటీవలే […]
Betting Apps : ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం మరో కుటుంబాన్ని కూలదోసింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోస్టల్ ఉద్యోగి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మృతుడు నరేష్ (విజయనగరం జిల్లా బొబ్బిలి వాసి) భార్య, కూతురుతో వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో మునిగిపోయిన నరేష్ భారీ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాడు. గెలుస్తాననే ఆశతో మరింతగా బెట్టింగ్ చేస్తూ చివరికి సుమారు రూ.15 లక్షల అప్పులు […]