డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు. ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ […]
దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా DRF సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ కలహాలతో మానసిక ఆవేదనకు గురైన రహీం అనే వ్యక్తి చెరువులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు.
వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు రాత్రంతా MMTS రైళ్లను నడపనున్నారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు.
కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా […]
Khairatabad : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకల్లో మహిళలు, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నవారిపై షీ టీం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారు 900 మంది పోకిరీలను షీ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. షీ టీం దృష్టిలో పడిన వారిలో 55 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని కౌన్సెలింగ్‌కు హాజరుపరచగా, పెద్దవారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొంతమందిని కోర్టులో హాజరు పరచే విధంగా […]
తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ) పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడింది. సోమవారం రాత్రి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.