యాదాద్రి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడి చర్చలకు దారితీశాయి.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారిందని ఆయన ఆరోపించారు.
ప్రపంచం విజయవాడ వైపు చూడాలనే ఈ ఉత్సవ్! 2025 దసరా సందర్భంగా ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. ‘విజయవాడ అందమైన సిటీ. విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్‌తో చేస్తున్నారు. ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుంది. […]
హైదరాబాద్‌లో మరోసారి భారీ స్థాయి డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్, తెలంగాణ నార్కో బ్యూరో సంయుక్త దర్యాప్తుతో కీలక అంశాలు బయటపడ్డాయి.
కామారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సభ ఘనంగా జరిగింది. ఈ సభ బీజేపీకి కనువిప్పు కలిగించేలా, రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పేలా నిలుస్తుందని బీజేపీ నేత మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Errabelli Dayakar Rao : హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. Bollywood […]
గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు. ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ […]