ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన పాక్ కు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. మెరుపు బౌలింగ్ తో విరుచుకుపడి పాక్ నడ్డివిరిచారు. పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణ్ చక్రవర్తి 02, అక్షర్ పటేల్ 02, కుల్దీప్ యాదవ్ 04, బుమ్రా 01 వికెట్లు పడగొట్టారు.
ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు.
IndvsPak : ఉత్కంఠపోరులో భారత్ ఘన విజయం. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టిన మ్యాచ్. ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్. హసీమ్ ఆష్రఫ్ ఓవర్‌లో చివరి బంతికి శివమ్ దుబే (33) ఔట్.
తిలక్‌వర్మ హాఫ్ సెంచరీ.
నాలుగవ వికెట్ కోల్పోయిన భారత్. అబ్రార్ అహ్మద్ ఓవర్ లో సంజు శాంసన్ ఔట్ (24).
పదో ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్: 58/3. క్రీజులో తిలక్‌వర్మ (24), సంజు శాంసన్ (16).
ముగిసిన పవర్‌ప్లే. భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు. క్రీజులో తిలక్‌వర్మ (14), సంజు శాంసన్ (4).
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా. ఫహీమ్ అష్రఫ్ ఓవర్‌లో చివరి బంతికి శుభ్‌మన్‌గిల్ ఔట్. ప్రస్తుతం భారత్ స్కోర్: 20/3
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. షాహీన్ అఫ్రిది ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్1(5) ఔట్.. ఒక్క పరుగు చేసి వెనుదిరిగిన సూర్యకుమార్.. ప్రస్తుతం భారత్ స్కోరు: 10/2
రెండో ఓవర్ పూర్తి.. ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు సాధించిన టీమిండియా
బరిలో సూర్యకుమార్ యాదవ్ (1), శుభ్‌మాన్ గిల్ (4)..
మొదటి వికెట్ కోల్పోయిన భారత్..
ఫహీమ్ అష్రఫ్ చేతిలో అభిషేక శర్మ 5(6) ఔట్..
తన మొదటి బాల్‌కే వికెట్ తీసిన ఫహీమ్ అష్రఫ్..
ప్రస్తుతం భారత్ స్కోరు: 7/1
బరిలోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..
బరిలోకి దిగిన అభిషేక శర్మ, శుభ్‌మాన్ గిల్..
తొలి ఓవర్ ప్రారంభించిన షాహీన్ అఫ్రిది..
84 రన్స్‌కి మొదటి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
రెచ్చిపోయిన భారత బౌలర్లు..
146 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు..
పాకిస్థాన్ ఆలౌట్.. 146 పరుగులకు కుప్పకూలిన దాయాది జట్టు..
చివరి వికెట్ ఖాతాలో వేసుకున్న బుమ్రా..
ఆరు పరుగులు సాధించి వెనుదిరిగిన నవాజ్ 6(9)..
19 ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. 5 పరుగుల ఇచ్చిన వరుణ్..
పాకిస్థాన్ స్కోరు: 146/9
తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టు..
బుమ్రా ఓవర్‌లో వెనుదిరిగిన హరిస్ రౌఫ్ 6(4)..
ప్రస్తుతం పాక్ స్కోరు: 141/9..
క్రీజ్‌లోకి కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అబ్రార్ అహ్మద్..
ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్..
కుల్దీప్ ఓవర్‌లో ఫహీమ్ అష్రాఫ్ ఔట్ 0(2)..
17 ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన కుల్దీప్..
ప్రస్తుతం పాక్ స్కోరు: 135/8
ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్..
కుల్దీప్ యాదవ్ ఓవర్‌లో షాహీన్ అఫ్రిది 0(2) ఔట్ ..
17వ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన యాదవ్..
ప్రస్తుతం పాక్ స్కోరు: 134/7
ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టు..
కుల్దీప్ యాదవ్ ఓవర్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా 8(7) ఔట్..
క్రీజ్‌లోకి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ షాహీన్ అఫ్రిది..
ప్రస్తుతం పాక్ స్కోరు: 133/6
ఐదవ వికెట్ కోల్పోయిన పాకిస్థాన్..
అక్షర్ పటెల్ ఓవర్‌లో హుస్సేన్ తలాత్ 1(2) ఔట్..
15.3వ ఓవర్‌లో క్యాచ్ ఇచ్చిన హుస్సేన్ తలాత్1(2)..
క్రీజులోకి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ మొహమ్మద్ నవాజ్..
నాలుగవ వికెట్ కోల్పోయిన పాక్..
15 ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి..
14.3 ఓవర్‌లో సిక్స్ బాదిన ఫఖర్ జమాన్ 46(35)
నెక్ట్స్ బాల్‌లోనే జమాన్ 46(35) ఔట్..
బరిలోకి హుస్సేన్ తలత్..
ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు: 126/4
మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టు..
అక్షర్ పటెల్ ఓవర్‌లో మహ్మద్ హరీస్ 0(2) ఔట్ ..
ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు: 115/3 (13.4)..
బరిలోకి సల్మాన్ ఆఘా..
మరో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టు..
వికెట్ తీసిన కుల్దీప్ యాదవ్..
12.5 ఓవర్‌లో సైమ్ అయూబ్ ఔట్..
ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్: 113/2
12 ఓవర్ వేసిన తిలక్ వర్మ.. 11.2 బాల్‌కి ఫోర్ బాదిన జమాన్..
ఈ ఓవర్‌లో తొమ్మిది పరుగులు ఇచ్చిన తిలక్..
12 ఓవర్ల తర్వాత పాకిస్థాన్ స్కోరు 107-1.
11వ ఓవర్ పూర్తి చేసిన శివమ్ దూబే..
11వ ఓవర్‌లో 11 రన్స్ ఇచ్చిన శివమ్ దూబే..
దూబే ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన అయూబ్..
పదో ఓవర్ పూర్తి చేసిన వరుణ్ చక్రవర్తి.. తొలి వికెట్ పడగొట్టిన వరుణ్..9.4 ఓవర్‌లో ఫర్హాన్ 57(38) ఔట్.. అద్భుతంగా క్యాచ్ పట్టిన తిలక్ వర్మ.. పాక్ స్కోర్: 87/1
పదో ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. తొలి వికెట్ తీసిన వరుణ్.. 9.4 ఓవర్‌లో ఫర్హాన్ 57(38) ఔట్.. అద్భుతంగా క్యాచ్ పట్టిన తిలక్ వర్మ..ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ సైమ్ అయూబ్ క్రీజులోకి వచ్చాడు.
తిరిగి బంతి చేతపట్టిన కుల్దీప్.. మొదటి బంతి వైడ్ వేశాడు.. రెండో బంతికి సిక్స్ బాదిన ఫఖర్ జమాన్.. ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన ఫర్హాన్.. 35 బంతుల్లో 50 రన్స్.. ఈ ఓవర్‌లో 13 రన్స్ ఇచ్చిన కుల్దీప్.. ప్రస్తుతం పాక్ స్కోర్: 77-0
ఆఫ్ సెంచరీకి చేరువలో సాహిబ్జాదా ఫర్హాన్(47).. ఎనిమిదవ ఓవర్ పూర్తి చేసిన అక్షర్.. తన ఓవర్‌లో ఎనిమిది రన్స్ ఇచ్చిన అక్షర్.. ఎనిమిది ఓవర్లకు పాక్ స్కోర్: 64/0
బౌలింగ్ బరిలోకి కుల్దీప్ యాదవ్.. 11 రన్స్ ఇచ్చిన కుల్దీప్.. చివరి బంతికి సిక్సర్ బాదిన సాహిబ్జాదా ఫర్హాన్.. ఆఫ్ సెంచరీ దాటిన పాక్ స్కోర్( 57/0)..
పవర్ ప్లే పూర్తైంది.. పాక్ స్కోర్: 45/0
స్పిన్నర్లను రంగంలోకి దించిన భారత కెప్టెన్ సూర్యకుమార్.. ఆరో ఓవర్ వేసిన లెఫ్ట్‌హ్యాండ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. ఎనిమిది రన్స్ ఇచ్చిన అక్షర్.. ప్రస్తుతం పాక్ స్కోర్: 45/0
5 వ ఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వరుణ్ చక్రవర్తి.. ఐదు రన్స్ మాత్రమే ఇచ్చాడు.. ప్రస్తుతం సాహిబ్జాదా ఫర్హాన్ (26) జమాన్(9) గా కొనసాగుతున్నారు..
నాలుగవ ఓవర్ వేసిన బూమ్రా 14 పరుగులు ఇచ్చాడు.. సాహిబ్జాదా ఫర్హాన్(24) మొదటి బంతిలోనే ఫోర్ బాదాడు.. మూడో బంతిలో సిక్స్ కొట్టాడు.. తరువాత వరుసగా సింగిల్స్ వచ్చాయి.. సింగిల్ తీసే సమయంలో ఫర్హాన్ భుజానికి ఏదో గాయమైంది. ఫిజియో చికిత్స అందించాడు.. అనంతరం తిరిగి రంగంలోకి దిగాడు..
మూడో ఓవర్‌ను మళ్లీ శివం దూబే వేశాడు.. ఎనిమిది పరుగులు ఇచ్చాడు..
మొదటి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా ప్రారంభించాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతికి ఫర్హాన్ రెండు పరుగులు తీశాడు.. ఐదో బంతికి బాదిన ఫర్హాన్ ఫోర్ బాదాడు..
శివం దుబే వేసిన ఐదవ బంతికి సాహిబ్జాదా ఫర్హాన్ FOUR బాదాడు.. ఫస్ట్ ఓవర్ మగిసే సమయానికి 4 పరుగులు మాత్రమే సాధించారు.
మొదటి ఓవర్‌ను శివం దుబే ప్రారంభించాడు. సాహిబ్‌జాదా ఫర్హాన్ నాలుగు బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు..
అభిమానుల కేరింతల మధ్య ప్రారంభమైన మ్యాచ్..
ఒకే ప్రత్యర్థి జట్టుతో టోర్నమెంట్‌లో మూడుసార్లు ఆడటం ఆసక్తికరంగా ఉంటుందని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. పవర్ ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసే తన కొత్త పాత్రను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. జట్టుకు ఎప్పుడు, ఎక్కడ అవసరమైనా తాను బౌలింగ్ చేయడానికి సంతోషంగా ఉన్నానని చెప్పాడు.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి
ఈ మ్యాచ్‌కు ముందు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. హార్దిక్ స్థానంలో రింకు సింగ్‌కు అవకాశం లభించింది. గత మ్యాచ్‌లో హార్దిక్ గాయపడటం గమనించదగ్గ విషయం. అతను ఒక ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. సమరానికి సిద్ధమైన సూర్యకుమార్ యాదవ్ జట్టు..
ఆసియా కప్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. దాయాదీల భారత్, పాకిస్థాన్‌లు మూడోసారి తలపడుతున్నాయి. టోర్నీలో ముచ్చటగా మూడోసారి తలపడుతున్నాయి.
కాసేపట్లో దాయాదుల మధ్య పోరు. భారత్ గెలవాలని నగరంలో ప్రత్యేక పూజలు.. దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీమ్ ఇండియా ఫ్యాన్స్.. కొన్ని చోట్ల హోమాలు.. ఆపరేషన్ సింధూర్ మాదిరిగానే ఆసియా కప్ లోనూ పాక్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగించాలని ఫ్యాన్ పూజలు.. కొన్ని చోట్ల స్క్రీనింగ్ లు ఏర్పాటు.. వివాదాలు, రాజకీయాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ..