ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లాలోని కందకూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి భారీ ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు హజరై ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు […]
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరుగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్కు దిగారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 6 మ్యాచ్లు ఆడి […]
రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పరామర్శించారు. సంతోష్ కుంటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిదని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఆత్మహత్య చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిందితులపై సెక్షన్ 306తో పాటు 302,307 సెక్షన్లు కూడా పెట్టాలన్నారు. ఆత్మహత్య జరిగి నాలుగు రోజులు అవుతున్న జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నట్లు..? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు నిందితులను పార్టీ నుండి […]
ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ ఆదేశానుసారం వచ్చి సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని ఆయన తెలిపారు. సాయి కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, సాయి గణేష్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించడం అతని తప్పా అని ఆయన అన్నారు. మజ్దూర్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ తప్పులను ఎత్తి […]
తెలంగాణ సీఎం కేసీఆర్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇద్దరు సీఎంల దగ్గర పనిచేస్తున్నా.. ఇద్దరూ భిన్నమయిన వ్యక్తులని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ పదవిలో వున్నా ప్రజలకు సేవచేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంశాన్ని కేంద్రం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు. అయితే ఆమె ప్రస్తుతం ఢిల్లీ […]
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ పనులను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రగతి భవన్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ పనులను పర్యవేక్షించారు. ఆరు అంతస్థుల సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తవగా.. వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ పనులను పరిశీలించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ కార్యక్రమం రద్దు కావడంతో నేడు సెక్రటేరియట్ను సీఎం కేసీఆర్ సందర్శించారు. సెక్రటేరియట్ లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి […]
ఇటీవల గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బహిర్గతం కావడంతో పార్టీ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని క్రమ శిక్షణ చర్యల కింద కవితను ఆమె పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ […]
రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని, కేసీఆర్ కుటుంబంపై ఈడీ విచారణ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రౌడీ గా మారిపోయి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి రాష్ట్ర సమితి రాబందుల సమితి గా మారిందన్నారు. పోలీసు యంత్రాంగంను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్ట్ లు, ప్రశ్నించే […]