Vijayashanti : ఎంతమంది గుంపులుగా, గ్రూపులుగా వచ్చినా.. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారిలో విజయశాంతి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనన్నారు. మోడీ సభ రోజే… పోటీగా సభ పెడుతున్నారని, ఎంతమంది గుంపులుగా.. గ్రూపులుగా వచ్చినా… మేము సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ లేదు… ఏం లేదు… అంతా ఉత్తిదేనని కొట్టేసిన ఆమె.. ప్రభుత్వం కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
Balka Suman : బీజేపీ దొంగల ముఠాగా తయారైంది
Also Read
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
కలర్ బొమ్మలు పెట్టి ఫ్లెక్సీ లు పెట్టగానే టీఆర్‌ఎస్ ఏదో చేసినట్టు కాదని విజయశాంతి వ్యాఖ్యానించారు. పనికిమాలిన పనులు చేస్తోంది ప్రభుత్వమని, బీఆర్‌ఎస్ లేదు.. ఏం లేదు… టీఆర్‌ఎస్ పరిస్థితి వీఆర్‌ఎస్ అయితదంటూ సెటైర్లు వేశారు. యశ్వంత్ సిన్హా కోసం ర్యాలీ పెట్టుకుంటాం అంటే… నేనేం కామెంట్ చేయను. అవి రాష్ట్రపతి ఎన్నికలు… మా సభ రోజే పెట్టుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టమని ఆమె అన్నారు. డబ్బుల ఆశ చూపి… పోలీసులతో బెదిరించి… మభ్య పెట్టి మా కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేసిఆర్ లాంటి నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని, జాతీయ స్థాయి లో కేసిఆర్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ దిక్కు లేదు గానీ జాతీయ స్థాయి లో ఏం చేస్తారని, బీజేపీ సమావేశాలతో టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందని ఆమె చురకలు అంటించారు.
తాజావార్తలు
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!