CV Anand : పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంది. తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. 3వ తేదీ రాత్రికి ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేయనున్నట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ తర్వాత రాజ్ భవన్ లో ప్రధాని బస చేస్తారన్నారు. అయితే ఆయన బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్ లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు.
హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో 4వేల మంది పోలీసులు పహారాలో ఉంటారని, జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తోన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహా.. కేంద్రమంత్రులు సభకు హాజరవుతారని, పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చునే అవకాశం ఉంటోందన్నారు. సభకు ప్రధాని మోదీ సహా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉందని, కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ స్థలాలు కేటాయించారన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించామని, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారని, డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టర్ ఇంఛార్జ్ లుగా నియమించామన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!