Balka Suman : బీజేపీ దొంగల ముఠాగా తయారైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దద్దమ్మలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ కున్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవడంలో లేదంటూ ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ పాలిట దద్దమ్మ అయితే మోడీ దేశం పాలిట ప్రజాకంఠకుడు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ దొంగల ముఠా గా తయారైందని, జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట కిషన్ రెడ్డి, బండి సంజయ్ వసూళ్లకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల వసూళ్ల పర్వాన్ని పార్లమెంటు సాక్షిగా ఎండగడుతామన్న బాల్క సుమన్.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు చేసినదేమిటో చెప్పాలని ప్రశ్నించారు.
Dasoju Sravan Kumar : రక్షణ కల్పించే వ్యవస్థ అచేతన స్థితిలో ఉంది
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
కేసీఆర్‌ను తిట్టడానికి పరిమితమయితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా.. దేశమంతా బై బై మోడీ అంటున్నారని, ఇకనైనా బీజేపీ నేతలు సిగ్గుపడి బుద్ది తెచ్చుకోవాలంటూ ఆయన హితవు పలికారు. ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణకు విచ్చేస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు తెలంగాణకు చేరుకున్నారు. కొంతమంది కేందమంత్రులు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సాలు దొర.. సెలవు దొర పేరిట బీజేపీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేస్తే… సాలు మోడీ.. సంపకు మోడీ పేరిట టీఆర్‌ఎస్ నేతలు సైతం హోర్డింగులు పెట్టారు.
తాజావార్తలు
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
-
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
-
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!