ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ అచేతన స్థితి లోకి వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ డ్యూటీ ఎమ్మెల్యే లకు ఎస్కార్ట్ గా మారిపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల లెటర్స్ ఉంటేనే ఎస్సై, సీఐల బదిలీలు చేస్తున్నారని, ఇలాంటి నిబంధన డిపార్ట్ మెంట్ లో ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ట్రాన్స్‌ఫర్‌లకు, పోస్టింగ్ లకు ఎమ్మెల్యే ల లెటర్ తప్పని సరి అయ్యిందనన్న దాసోజు.. లంచం ఇస్తే తప్పితే బదిలీలు జరగడం లేదంటూ ఆరోపణలు చేశారు. డీజీపీ ఇచ్చిన ఆదేశాలు కూడా అమలులోకి రావడం లేదని, డీజీపీ ఇచ్చిన 15 ట్రాన్స్‌ఫర్స్ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దానం భూ దందా ఆపేపని చేస్తే సీఐనీ బదిలీ చేశారని ఆయన మండిపడ్డారు. 12 నెలల్లో ఇద్దరు సీఐలు బదిలీ అయ్యారని, పబ్బులను టైంకి మూసేయించాలని చెప్పిన సీఐని ట్రాన్స్‌ఫర్ చేశారని, రాడిసన్ బ్లూ పబ్బు అరాచకాలు ఆపాలని చూస్తే.. సీఐని బదిలీ చేశారన్నారు.
CV Anand : పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా
పబ్బుల నియంత్రణ చేస్తే ఎమ్మెల్యే బదిలీ చేయించారని, పట్టించుకోక పోతే పబ్బుల్లో డ్రగ్స్ దొరికాయి అని ఇంకో సీఐని బదిలీ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి గోపి.. దానం మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని, ఇద్దరి మధ్య పోలీసులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. సీపీ ఆనంద్ సిన్సియర్ .. కానీ అయన కూడా ఏం చేయలేని పరిస్థితి.. సిన్సియర్ అధికారిని కూడా సీవీ ఆనంద్ ట్రాన్స్‌ఫర్ చేశారు.. అప్పుడు సీవీ ఆనంద్ కి ఏం విలువ.. నర్సింగ్ రావు అనే ఏసీపీ… దానం మనిషి , అలా ఎలా అని మాగంటి గోపి అడ్డుకున్నారు.. డీజీపీ ఇచ్చిన ఆదేశాలు కూడా ఆపేస్తున్నారు.. ఇంత రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే ఏం చెప్పాలి అంటూ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.