Harassment : యువతి ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్.. డబ్బులు కావాలంటూ బ్లాక్‌మెయిల్.. విచారణ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ పెరుగుతోంది.. అందుకు తగ్గట్టుగానే మోసాలూ పెరుగుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీని మంచికంటే ఎక్కువగా చెడుకే వినియోగిస్తున్నారు. అయితే.. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో వేధింపులకు పాల్పడిన ఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాతో యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి, డబ్బు ఇవ్వాలని వేధిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఎం. పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో నివాసముండే ఓ యువతికి, చిన్ననాటి మిత్రురాలి ద్వారా ఇన్స్టాలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నవదీప్ పరిచయమయ్యాడు. తాజాగా ఇంటర్మీడియట్ పూర్తిచేసి, డిగ్రీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. స్నేహంగా ఉంటూ యువతి ఇన్స్టా ఖాతా వివరాలు తెలుసుకున్నాడు.
Also Read
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
అనంతరం తాను వేరే పేరుతో ఓ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి, యువతికి సందేశాలు మొదలు పెట్టాడు. అనంతరం ప్రొఫైల్ ఫొటోను నగ్నచిత్రంగా మార్చి.. సదరు యువతికి పంపిస్తూ.. డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. వేధింపులు రోజురోజుకూ పెరుగుతుండటంతో యువతి ఠాణాకి వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో.. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించగా.. నవదీపే ఈ పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పవన్ తెలిపారు.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా? నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!